TG Inter Supply Results: తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించి బోర్డు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఇప్పటికే మూల్యాంకాన ప్రక్రియ పూర్తయ్యింది. సాంకేతికపరమైన అంశాలను పరిశీలన సైతం పూర్తవ్వడంతో ఇవాళ మధ్యహ్నం 2గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇక.. ఫలితాలకోసం www://tgbie.cgg.gov.in, http://results.cgg. gov.in వెబ్‌సైట్లను సంప్రదించాలని సూచించారు.
Read also: Hyderabad Night Shopping: నైట్ షాపింగ్ చేసే వాళ్లకు బిగ్ షాక్!.. 10.30కే ఆ దుకాణాలు బంద్..
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షకు దాదాపు నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు హాజరైనట్లు సమాచారం. వీరిలో పరీక్షల్లో ఫెయిలైనవారితో పాటు ఫస్టియర్‌లో ఇంప్రూవ్‌మెంట్ కోసం రాసిన విద్యార్థులూ ఉన్నారు. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి 12 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించారు. అలాగే.. జూన్ 4 నుంచి 8వ తేదీ వరకు ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు.
Gold Rate Today: బంగారం ధరలకు బ్రేక్.. కొనేందుకు ఇదే సరైన సమయం!