Tension at Nampally: హైదారబాద్ లోని నాంపల్లిలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. యూత్ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ముందు బైటాయించారు. యూత్ కాంగ్రెస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మోత రోహిత్ మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు అనుగూనంగా తప్పుగా వచ్చిన 7 ప్రశ్నలకు మార్కులు కలపాలని డిమాండ్ చేశారు. రన్నింగ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ కు అవకాశం ఇవ్వాలని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడిన అభ్యర్థులకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ లు పరిష్కరించకపోతే వేలాది మంది అభ్యర్థులతో ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చారించారు.
Read also: Virat Kohli: హైదరాబాద్ జిమ్‌లో విరాట్ కోహ్లీ.. ఫ్యాన్స్ హంగామా
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దేశంలో ఎక్కడా లేని నిబంధనలు రాష్ట్రంలో తీసుకొచ్చారని ఆరోపించారు. కొత్త నిబంధనలతో వేలాది మంది పోలీసు అభ్యర్థులు నష్టపోతారని, రేసులో ఉత్తీర్ణులైన వారందరికీ మెయిన్స్ పరీక్షకు అవకాశం కల్పించాలని కోరారు. విద్యార్థుల పట్ల తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేహదారుఢ్య పరీక్షలు పాత పద్ధతిలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో లక్షలాది మంది నిరుద్యోగులు నష్టపోతున్నారని.. తక్షణమే లాంగ్ జంప్ ను 4 నుంచి 3.8మీటర్లకు కుదించాలన్నారు.
Read also: Puvvada Ajay Kumar: కాంగ్రెస్ ను ఓడించడానికి సుపారీ అవసరం లేదు.. వాళ్ళ నేతలే చాలు
కాగా.. గత రిక్రూట్మెంట్లో పరుగుపందెం 800 మీటర్లు ఉండగా దానిని 1600 మీటర్లకు పెంచారని, లాంగ్‌జంప్ 3.8 మీటర్లు ఉంటే 4 మీటర్లు, షాట్‌పుట్ 5.6 మీటర్లు ఉండగా దానిని 6 మీటర్లు పెంచడంతో చాలా మంది అభ్యర్థులు నష్టపోయారని తెలిపారు. ఇక.. గతంలో 5 ఈవెంట్లు ఉండగా దానిలో ఏవైనా 3 అర్హత సాధిస్తే వారిని సివిల్, ఫైర్ ఉద్యోగాలకు అనుమతి ఇచ్చేవారని.. ఈసారి అలా కాకుండా అన్ని క్వాలిఫై అయితేనే తుది రాత పరీక్షకు అనుమతించడంతో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నామని కొందరు విద్యార్థులు వాపోయారన్నారు. ఈనేపథ్యంలో తక్షణమే ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Puvvada Ajay Kumar: బండి సంజయ్ పై పువ్వాడ ఫైర్.. కంటి వెలుగులో పరీక్ష చేయించుకోమని సెటైర్
