Site icon NTV Telugu

Lucky Lady: ఒకే మహిళకు రెండు మద్యం దుకాణాలు..

Untitled Design (2)

Untitled Design (2)

తెలంగాణ వ్యాప్తంగా వైన్స్ షాపులకోసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు టెండర్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎంతో మంది అశావాహులు టెండర్లు దక్కించుకునేందుకు నువ్వానేనా అన్నట్లుగా పోటీపడుతున్నారు. అయితే.. ఓ మహిళ ఏకంగా రెండు వైన్ షాపులను దక్కించుకున్నారు. అయినప్పటికి ఆమెకు వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేదు. రెండు వైన్ షాపులు రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి..

Read Also:Tragedy: ఏందమ్మా ఇది.. ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రియుడితో జంపైన భార్య..

ఈ ఏడాది ప్రభుత్వం పిలిచిన మద్యం దుకాణాల టెండర్లలో పాల్గొన్న ఆమెకు రెండు దుకాణాలు దక్కాయి. రెండు దుకాణాలకు దరఖాస్తు చేసుకున్న ఆమెకు అదృష్టం తలుపు తట్టింది. రెండింటా లక్కీ డ్రా లో విజేతగా నిలిచింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న గుర్రాల హారిక లక్ష్మణ చందా, పొనకల్ గ్రామాల్లో రెండు మద్యం దుకాణాలకు టెండర్లు వేసింది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా పద్ధతిలో లాటరీ తీయడంతో.. ఆమెకు లక్కు కలిసోచ్చింది. ఏకంగా ఆమె రెండు షాపులు దక్కించుకున్నది. దీంతో స్థానికులు ఆమెను లక్కీ లేడీ అంటూ అభినందించారు.

Exit mobile version