TS TET 2024: తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాగానే…. టీఎస్ టెట్ 2024 ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. మార్చి 27 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ముందస్తు తేదీలను ప్రకటించిన విద్యాశాఖ… పూర్తి వివరాలను వెల్లడించనుంది. అయితే తెలంగాణ టెట్ 2024 పరీక్షకు సంబంధించిన సమాచారాన్ని విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. ఇందులో దరఖాస్తు రుసుమును భారీగా పెంచారు. గతంలో ఒక పేపర్ రాయాలంటే రూ. 200… ఇప్పుడు రూ. 1000 చెల్లించాలి. రెండు పేపర్లు రాస్తే రూ. 2000 చెల్లించాలి. https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిసారీ విద్యాశాఖ పెరుగుతోంది. ఈసారి కూడా రూ. 1000 చేరుకుంది. దీంతో ఈసారి పరీక్ష రాసే అభ్యర్థులు.
Read also: Rajasthan: ముక్క, చుక్క ఉంటేనే ముట్టుకో లేదంటే డివోర్స్.. భర్తకు భార్య వింత డిమాండ్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో తొలిసారిగా టెట్ పరీక్ష నిర్వహించగా.. అప్పుడు ఫీజు కేవలం రూ. 200. ఆ తర్వాత 2017లో కూడా అదే రుసుమును కొనసాగించారు. ఆ తర్వాత 300 చేశారు. గతేడాది నిర్వహించిన పరీక్షకు సంబంధించి రూ. 400 నిర్ణయించారు. ఈ రుసుము రెండు పేపర్లకు కలిపి ఉండేది. అయితే ఈసారి… ఒక్క పేపర్ రాసేందుకు రూ. 1000గా నిర్ణయించారు. రెండు పేపర్లు రాస్తే రెండు వేలు చెల్లించాలి. దరఖాస్తు ఫీజు భారీగా పెరగడంపై అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. తెలంగాణ టెట్ దరఖాస్తులు మార్చి 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ.. మే 20 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని.. జూన్ 3న పరీక్షలు ముగుస్తాయని విద్యాశాఖ తెలిపింది. https://tstet.cgg.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
Read also: Murder: అప్పు ఇచ్చిన పాపానికి దారుణంగా హత్యకి గురైన వృద్దురాలు..!
TS TET కీలక తేదీలు: TS TET కీలక తేదీలు:
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ – 04, మార్చి, 2024.
దరఖాస్తులు ప్రారంభం – మార్చి 27, 2024.
దరఖాస్తులకు చివరి తేదీ – ఏప్రిల్ 10, 2024.
హాల్ టిక్కెట్లు – మే 15, 2024.
పరీక్షల ప్రారంభం – మే 20, 2024.
పరీక్షల ముగింపు – జూన్ 06,2024.
టెట్ ఫలితాలు – జూన్ 12, 2024.
అధికారిక వెబ్‌సైట్ – https://tstet.cgg.gov.in/
తాజాగా టెట్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో… మరోవైపు డీఎస్సీకి భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఇందులో అర్హత సాధిస్తే.. డీఎస్సీ పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది. మార్చి 4 నుంచి డీఎస్సీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇటీవల భర్తీ చేయనున్న మొత్తం 11,062 ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. 727 మంది భాషాపండితులు, 182 మంది పీఈటీలు, 6,508 మంది ఎస్జీటీలు, స్పెషల్ కేటగిరీలో 220 మంది స్కూల్ అసిస్టెంట్లు, 796 మంది ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉద్యోగాలు ఉన్నాయి. గతంలో డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు తాజా నియామకాలకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. డీఎస్సీ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది.
Pragya Jaiswal : అదిరిపోయే లుక్ లో అఖండ బ్యూటీ స్టిల్స్..