NTV Telugu Site icon

TS TET Results: నేడే తెలంగాణ టెట్‌ ఫలితాలు.. చెక్‌ చేసుకోండి ఇలా..

Tet 2023 Result

Tet 2023 Result

TS TET Results: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు టెట్ కన్వీనర్ రాధా రెడ్డి మంగళవారం వెల్లడించారు. ఫలితాల విడుదలకు ఇప్పటికే సర్వం సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన చేశారు. ఈసారి తెలంగాణ టెట్-2023 ఫలితాలు ప్రకటించిన తేదీనే విడుదల చేయనున్నారు. ఇప్పటికే టీఎస్ టెట్ ప్రాథమిక కీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈసారి టెట్ ఫలితాలతో పాటు ఫైనల్ కీ కూడా విడుదల కానుంది.

తెలంగాణ టెట్ 2023 సెప్టెంబర్ 15న ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లుగా జరిగిన విషయం తెలిసిందే. అలాగే తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌టీఈటీ) ఫలితాలు సెప్టెంబర్ 27న విడుదల కానున్నాయి.ఈ ఫలితాలు కేవలం 12 రోజుల్లో విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈరోజు ఉదయం వెలువడే టెట్ ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీని కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని కన్వీనర్ తన ప్రకటనలో తెలిపారు. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే విద్యాశాఖ టెట్ ఫలితాలను విడుదల చేయడం గమనార్హం. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే.పేపర్ 1 పరీక్షకు 2,26,744 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా, పేపర్ 2 పరీక్షకు 1,89,963 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Read also: Warangal: వరంగల్ లో నేడు, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు.. కారణం ఇదీ..

టెట్ ప్రిలిమినరీ ఆన్సర్ కీ సెప్టెంబర్ 20న విడుదలైంది. ఈ క్రమంలో బుధవారం టెట్ ఫలితాలు వెలువడిన తర్వాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. టెట్ అర్హత కాలాన్ని జీవితకాలంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. టెట్ పేపర్ 1లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్‌జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పేపర్ 2లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తెలంగాణలో టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ)ని ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.
Air Ambulance: తెలంగాణలో ఎయిర్ అంబులెన్స్‌లు.. ఆపద సమయంలో అత్యవసర సేవలు..