NTV Telugu Site icon

Loksabha Elections 2024: ఎన్టీఆర్, మహేష్ సహా సినిమా సెలబ్రటీస్ ఓటు హక్కు వినియోగించుకునేది ఇక్కడే..

Hero Votings

Hero Votings

Telangana Loksabha Elections 2024 Tollywood Celebrities Polling Booths Details: తెలంగాణ సహా దేశం మొత్తం లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. గత కొద్దిరోజులుగా ప్రచారాలతో హోరెత్తించిన పార్టీలు ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడడంతో ఎన్నికల నిబంధనల మేరకు బ్రేక్ తీసుకున్నాయి. ఇక ఎన్నికల కోసం ఎక్కడెక్కడో ఉన్న మన టాలీవుడ్ టాప్ హీరోలు, హీరోయిన్లు, ఇతర నటీనటులు, టెక్నీషియన్లు అందరూ తమ విధిగా ఓటింగ్ లో పాల్గొననున్నారు. ఇప్పటికే షూటింగ్లలో బిజీగా ఉన్న వారు సైతం బ్రేక్ తీసుకుని ఒక్కరొక్కరుగా హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. ఇక ఏయే సెలబ్రిటీ ఏయే బూత్ లో తమ ఓటు హక్కు వినియీగించుకోనున్నారు అనే వివరాలు మీ కోసం

Telangana Assembly Elections 2023: రేపు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: ఎన్నికల సంఘం

ఓబుల్‌రెడ్డి స్కూల్‌ లో జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి
బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ జూబ్లీహిల్స్ లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్‌
జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ లో మహేశ్‌బాబు, నమ్రత , మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌, విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ ,శ్రీకాంత్‌ , జీవిత రాజశేఖర్
ఎఫ్‌ఎన్‌సీసీ లో రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌ , విశ్వక్‌సేన్‌ , దగ్గుబాటి రాణా, సురేశ్‌ బాబు,
జూబ్లీహిల్స్‌ క్లబ్‌ లో చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన , నితిన్‌
జూబ్లీ హిల్స్ న్యూ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ లో రవితేజ
వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ లో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌
మణికొండ: హైస్కూల్ లో వెంకటేశ్, బ్రహ్మానందం
షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ రాజమౌళి రామారాజమౌళి
బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలని లో హీరో రామ్ పోతినేని
గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాల లో హీరో నాని
దర్గా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ లో హీరో సుధీర్ బాబు
రోడ్‌ నెం.45, జూబ్లీహిల్స్‌ –ఆర్థిక సహకార సంస్థ: అల్లరి నరేశ్‌
యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాల: తనికెళ్ల భరణి