Site icon NTV Telugu

Pushpa 2 Stampede: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై మానవ హక్కుల కమిషన్‌ సీరియస్‌

Sandhya Theater

Sandhya Theater

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన ‘పుష్ప’ సినిమా ప్రివ్యూ షో సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TSHRC) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపై విచారణ చేపట్టిన కమిషన్, రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. అలాగే, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ ఘటనలో పోలీసుల పాత్రపై కూడా సంపూర్ణ నివేదిక సమర్పించాలని కమిషన్ స్పష్టం చేసింది.

Also Read : C Kalyan: విశ్వ ప్రసాద్ టాలెండ్ లేదనడం కరెక్ట్ కాదు..సీ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

‘పుష్ప’ సినిమా ప్రివ్యూ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో సినిమా చూసేందుకు వచ్చిన అభిమానుల రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో శ్రీ తేజ్ అనే బాలుడు కోమాలోకి వెళ్లగా అతని తల్లి రేవతి మరణించింది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న మానవ హక్కుల కమిషన్, విచారణను వేగవంతం చేసింది. ఈ ఘటనలో ప్రభుత్వం మరియు పోలీసుల వైఫల్యాలను పరిశీలిస్తూ, చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. బాధితుల కుటుంబాలకు తక్షణ పరిహారంగా రూ.5 లక్షలు చెల్లించాలని ఆదేశించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై నివేదికలో వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.

Exit mobile version