Governor Jishnu Dev Sharma: నేడు భద్రాద్రి.. ఖమ్మం జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ పర్యటించనున్నారు. ఇవాళ భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి వారిని గవర్నర్ దర్శించుకోనున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం ఖమ్మం చేరుకుని కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, కవులు, కళాకారులతో సమావేశం కానున్నారు. భద్రాచలంలో పర్యటనకు వచ్చిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే.. గురువారం సాయంత్రం బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ అతిథి గృహానికి చేరుకున్న ఆయన అనంతరం పోలీసుల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు.
గవర్నర్ షెడ్యూల్ ఇలా..
* గవర్నర్ ఉదయం 8.10 గంటలకు భద్రాచలంలోని శ్రీ సీతా రామచంద్ర స్వామిని దర్శించుకుంటారు.
* ఉదయం 9 గంటలకు కొత్తగూడెం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తారు.
* తర్వాత ఉదయం 11 గంటల వరకు ఎంపిక చేసిన 25 మంది ప్రముఖ రచయితలు, కళాకారులు, జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతలతో సమావేశమై మాట్లాడతారు.
* అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు ఖమ్మంలోని ఎన్నెస్పీ అతిథి గృహానికి గవర్నర్ చేరుకుంటారు.
* మధ్యాహ్నం 1.55 గంటలకు ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకుని 3 గంటల వరకు జిల్లా అధికారులతో మాట్లాడాలి.
* ఎంపికైన 25 మంది ప్రముఖ రచయితలు, కళాకారులు, జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతలతో గంటపాటు సమావేశమై హైదరాబాద్‌కు బయలుదేరారు.
గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు..
జిల్లాకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రానున్న దృష్ట్యా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆమె.. గవర్నర్ పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేశారు.
Astrology: అక్టోబర్ 25, శుక్రవారం దినఫలాలు