Site icon NTV Telugu

CM Revanth Reddy : గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక పాలసీపై సీఎం రేవంత్ సమీక్ష

Cm Revanth Reddy

Cm Revanth Reddy

తెలంగాణలో గిగ్ వర్కర్ల (Gig Workers) సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత పాలసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా పాల్గొన్నారు. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని, వారికి ప్రమాద బీమా మరియు ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు అందించే విధంగా పాలసీ రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు.

Pawankalyan : ప్రతిసారి ఆ హీరోలతో పోల్చుకుంటున్న పవన్.. ఎందుకు..?

అధికారుల నుంచి పాలసీ వివరాలను తెలుసుకున్న సీఎం రేవంత్, గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం పైన దృష్టి పెట్టాలని సూచించారు. ఆ బోర్డులో ప్రభుత్వ ప్రతినిధులు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గిగ్ వర్కర్లకు సంబంధించిన పూర్తి డేటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచి పారదర్శకతను కాపాడాలని, వారికి అవసరమైన సహాయాలు సకాలంలో చేరే విధంగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

Hari Hara Veera Mallu Pre Release Event LIVE: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్

Exit mobile version