Site icon NTV Telugu

AP CM-TS CM: ఏపీ సీఎం జగన్‌ ట్వీట్.. తెలంగాణ సీఎం రేవంత్‌ రిప్లై

Jagan Revanth

Jagan Revanth

AP CM-TS CM: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్‌కి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా సీఎం రేవంత్‌ను అభినందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ట్విట్టర్‌లో స్పందించిన రేవంత్..’ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలతో స్నేహం పెంపొందించుకోవడంలో పరస్పర సహకారాన్ని ఆకాంక్షిస్తోంది అని అన్నారు.

Readd also: Indian Students: విదేశాల్లో భారతీయ విద్యార్థులు.. ఐదేళ్లలో 403 మంది మృతి

అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో సీఎం రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన శుభాకాంక్షలు అందించారు. ‘తెలంగాణలో కొత్త ప్రభుత్వానికి అభినందించారు. ప్మారణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు అభినందనలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సౌభ్రాతృత్వం, సహకారం వర్ధిల్లాలని నా హృదయ పూర్వకంగా కోరుకుంటున్నానని తెలిపారు.

Indian Students: విదేశాల్లో భారతీయ విద్యార్థులు.. ఐదేళ్లలో 403 మంది మృతి

Exit mobile version