NTV Telugu Site icon

KCR: రేపు సంచలన ప్రకటన.. టీవీలు చూడండి-కేసీఆర్‌

రేపు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేయనున్నట్టు వెల్లడించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. వనపర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రేపు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నాను.. నిరుద్యోగుల కోసం కీలక ప్రకటన రేపు చేస్తాను.. అందరూ గమనించాలి.. రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులంతా టీవీలు చూడాలని సూచించారు. అసెంబ్లీలో మార్చి 9న బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు నిరుద్యోగ యువ సోద‌రుల కోసం ప్రక‌ట‌న చేయ‌బోతున్నట్టు వెల్లడించారు కేసీఆర్… నిరుద్యోగ సోద‌రులంతా రేపు పొద్దున 10 గంట‌ల‌కు టీవీలు చూడండి. ఏం ప్రక‌ట‌న చేయ‌బోతున్నామో చూడాలన్నారు.. దీంతో.. రేపు కేసీఆర్‌ ఏ ప్రకటన చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది… మరీ ముఖ్యంగా నిరుద్యోగులు 10 గంటలకు టీవీలు చూడాలని కేసీఆర్‌ ప్రకటించారంటే… భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ ఉంటుందా? నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెబుతూ ఉద్యోగాల భర్తీకి పూనుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Read Also: KCR Live: వనపర్తిలో కేసీఆర్‌ భారీ బహిరంగసభ