NTV Telugu Site icon

TS Assembly Session: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 17 వరకు జరిగే అవకాశం

Ts Assembly Tomarrow

Ts Assembly Tomarrow

Telangana Assembly Session: రేపటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గత వారం సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం సభ వాయిదా పడింది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. తెలంగాణ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ నుంచి ఎన్నికయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. గుడిసెల వెంకటస్వామి అల్లుడు గడ్డం ప్రసాద్ కుమార్ మూడోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు కావడంతో పార్టీ అధిష్టానం స్పీకర్‌గా ఎంపిక చేసింది. అసెంబ్లీ స్పీకర్ పదవికి ఇతర నామినేషన్లు రాకపోతే ఆయన ఎన్నిక ఏకగ్రీవమవుతుంది.

రేపటి (గురువారం) నుంచి తిరిగి ప్రారంభమయ్యే సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు స్పీకర్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా ఎన్నుకోవాలని ఆ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ఆయన ఒంటరిగా నామినేషన్ వేస్తే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. మరొకరు చేస్తే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 15వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 16వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని శాసనసభ, మండలిలో విడివిడిగా ప్రవేశపెట్టి చర్చిస్తారు. 17న కూడా సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి.

Read also: Rajinikanth : రజినీకాంత్ విగ్రహానికి పాలాభిషేకం, ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్..

కౌన్సిల్ కోసం కొత్త భవనం..
తెలంగాణ శాసనమండలికి కొత్త భవనాన్ని నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని జూబ్లీ హాల్ ప్రాంగణంలో శాసనమండలి సమావేశం జరుగుతోంది. అదే ప్రాంగణంలో కొత్త భవనాన్ని నిర్మించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలకు కొత్త భవనాలు నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఎర్రమంజిల్‌లో సాగునీరు, రోడ్ల నిర్మాణానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ భవనం చారిత్రక (హెరిటేజ్) భవనాల జాబితాలో ఉంది. చిక్కుముడులను విప్పేందుకు నాటి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

తాజాగా జూబ్లీహాల్ ఆవరణలోనే శాసనమండలి నూతన భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో 1937లో జూబ్లీ హాల్ నిర్మించబడింది. హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన తర్వాత అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది. 2006లో వైఎస్‌ఆర్‌ కౌన్సిల్‌ను పునరుద్ధరించినప్పటి నుంచి శాసనమండలి సమావేశాలు ఆ భవనంలోనే జరుగుతున్నాయి. అదే ప్రాంగణంలో కొత్త భవనం నిర్మించాలంటే భవనాన్ని కూల్చివేయాల్సి రావడంతో ఏ మేరకు అనుమతులు లభిస్తాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త భవనం నిర్మించే వరకు ఎక్కడ సమావేశాలు నిర్వహిస్తారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Suryakumar Yadav: అందుకే ఓడిపోయాం: సూర్యకుమార్‌

Show comments