NTV Telugu Site icon

Telanagan: అమెరికాలో విషాదం.. బ్రెయిన్ స్ట్రోక్‌తో తెలంగాణ యువకుడు మృతి

Brain Stroke

Brain Stroke

Telanagan: విదేశాల్లో ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలని ఆశపడ్డాడు ఓ యువకుడు. తన కలను నెరవేర్చుకునేందుకు అమెరికా వెళ్లిన అతడిని విధి చిన్నచూపు చూసింది. బ్రెయిన్ స్ట్రోక్ రూపంలో మృత్యువు అతన్ని వెంబడించింది. సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన రుత్విక్ రాజన్ బ్రెయిన్ స్ట్రోక్‌తో అమెరికాలో మృతి చెండిన ఘటన కుటుంబంలో విషాదం నింపింది.

Read also: Vasantha Krishna Prasad: రెండు మూడు రోజుల్లో టీడీపీలో చేరుతా.. క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

రిటైర్డ్ ఆర్టీఓ తులసీరాజన్ పెద్ద కుమారుడు బండ రుత్విక్రజన్ (30) రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లో చేరి ఇటీవలే ఎంఎస్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం వెతుకుతున్న రుత్విక్రాజ్ తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో గత వారం రుత్విక్ తన స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రుత్విక్‌రాజ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు తేలింది. తమ కుమారుడు బంగారు భవిష్యత్తును ఆశించి విదేశాలకు వెళ్లడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆదివారం రాత్రి రుత్విక్ మృతదేహం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌కు తరలించారు.

తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, రుత్విక్‌ స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అందరితో స్నేహంగా మెలిగేవాడని, మంచి ఉద్యోగం చేసి కుటుంబానికి పెద్దదిక్కు అవుతాడని భావించామని కుటుంబ సభ్యులు అన్నారు. అయితే ఇంతలోనే రుత్విక్ స్నేహితుల నుంచి కాల్ రావడంతో అందరూ షాక్ కు గురయ్యామని తెలిపారు. అందరితో కాసేపు ఫోన్ లో మాట్లాడిన రుత్విక్ కొద్దిసేపటికే తను చనిపోయాడని వార్త రావడం కలిచివేసిందని తెలిపారు. పిల్లలు విదేశాల్లో చదువుకుంటా అంటే పంపించామని, లేదంటే ఇక్కడే మా వద్దే ఉండేవాడని వాపోయారు. రుత్విక్ విగతజీవిగా చూసి చలించిపోయామని అంటున్నారు.
KA Paul: పవన్‌కి ఇదే నా ఓపెన్‌ ఆఫర్.. ఎంత డబ్బు కావాలి..? మా పార్టీలో చేరితే సీఎంని చేస్తా..!