Site icon NTV Telugu

Inter Practical 2024: తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్స్.. నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు..

Inter Practicals

Inter Practicals

Inter Practical 2024: తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈరోజు ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 15 వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ప్రాక్టికల్ పరీక్ష మొత్తం మూడు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశ ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు.. ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు రెండుసార్లు, మూడో దశ ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు రెండుసార్లు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యార్థులు 3, 87,893 మంది కాగా.. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణలోని గురుకుల కళాశాలలు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవుతాయి.

Read also: CM Revanth Reddy: ఇంద్రవెల్లి నుంచే రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం..!

వీరిలో 2,17,714 మంది ఎంపీసీ విద్యార్థులు, 1,04,089 మంది బైపీసీ విద్యార్థులు, 46,542 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2,032 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లను ఆయా కళాశాలలకు పంపించారు. విద్యార్థులు కళాశాలల ప్రిన్సిపాల్‌ వద్దకు వెళ్లి హాల్‌టికెట్లు పొందాలని సూచించింది. పరీక్షల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దని అధికారులకు సూచించారు. ఎగ్జామినర్లు డబ్బులు డిమాండ్ చేస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ప్రాక్టికల్‌ ప్రశ్నపత్రాలను అరగంట ముందే ఆన్‌లైన్‌లో ఉంచుతారని.. ఎగ్జామినర్ వచ్చి పాస్‌వర్డ్ ద్వారా ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్ చేస్తారని వివరించింది. ప్రాక్టికల్ పరీక్షల వాల్యుయేషన్ కూడా వెంటనే జరిగేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.
Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Exit mobile version