Site icon NTV Telugu

Hyderabad Street Dogs: హైదరాబాద్‌లో మరో విషాదం..చిన్నారిపై దాడి చేసి చంపేసిన వీధి కుక్కలు

Shamshabad Dogs

Shamshabad Dogs

Hyderabad Street Dogs: హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కుక్క కాట్లకు ఓ చిన్నారి బలైంది. ఇంటి వద్ద నిద్రపోతున్న చిన్నారిని రోడ్డుపై లాక్కేలి చంపేశాయి. నిండు నూరేళ్లు జీవితాని సంవత్సరానికే పొట్టన పెట్టుకున్నాయని చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మహబూబ్ నగర్ దేవరకద్ర నాగారం గ్రామానికి చెందిన సూర్యకుమార్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సమా ఎన్ క్లూ కాలనీలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నాడు. అయితే గురువారం అర్ధరాత్రి సూర్యకుమార్ నిద్రిస్తున్న సమయంలో సంవత్సరం వయస్సు ఉన్న పెద్ద కుమారుడు నాగరాజును 20 కుక్కలు ఒకేసారి పాసివికంగా దాడి చేసి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లాయి. ఇదంతా తల్లిదండ్రులు గమనించలేకపోయారు. కాసేపటికి పక్కన చిన్నారి కనిపించక పోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు తన కొడుకు నాగరాజు కోసం చుట్టుపక్కన వెతికినా ఎక్కడ కనిపించలేదు. చివరకు రోడ్డుపై కుక్కలు దాడిచేయడం గుర్తించారు.

పరుగెత్తుకుంటూ కుక్కలను తరిమి చూడగా చిన్నారి ఉలుకు పలుకు లేకుండా విగత జీవిగా పడివున్నాడు. చిన్నబాబుకు ఎమైందోనని గుండెలకు తల్లి హతైతుకున్నారు. బాబు వల్లంతా కుక్క కాట్లే నాగరాజు, నాగరాజు అంటూ లేపిన బాబు అప్పటికే మృతి చెందాడు. బాబును విగతజీవిగా చూసి కుటుంబ సభ్యులు గుండెలు బాదుకున్నారు‌. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు…కుక్కల దాడిలో మృతిచెందిన చిన్నారి నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు. చిన్నారి నాగరాజు మృతికి కారణం ముమ్మాటికి మున్సిపల్ ఆధికారులేనని స్థానిక కౌన్సిలర్ కొండ ప్రవీణ్ కుమార్ అరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఆధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఈ దుర్గటన జరిగిందని తెలిపారు.
TTD Hundi: వరుసగా 23వ నెల.. వంద కోట్ల మార్క్‌ దాటిన శ్రీవారి హుండీ ఆదాయం

Exit mobile version