Khammam Bike Lift Case Mystery: వారిద్దరిది పచ్చని సంసారం, భర్త తాపీ మేస్త్రీ, ఆమె మహిళలను కూలీకి తీసుకెళ్లే ముఠామేస్త్రీ. వారికున్న ఇద్దరు కుమార్తెకు పెళ్లిళ్లు చేసి.. వారి దంపతుల జీవితం ప్రశాంతంగా సాగుతోంది. ఇద్దరి మధ్యలో దూరం ఎంతుకు వచ్చిందో తెలియదు కానీ.. ఇంతలోనే భార్యకు అనైతిక బంధం అల్లుకుంది, విషబంధంలో చిక్కుకున్న ఆమె అంతటితో ఆగలేదు. తన అనైతిక బంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించేందుకు భార్యే భర్తకు మరణశాసనం రాసింది. తాళికట్భటిన భర్తపైనే విషప్రయోగం చేయించింది. తనకు ఏమీ తెలియనట్లు కట్టుకున్న భర్త కానరాని లోకానికి వెళ్లాడంటూ కన్నీరు కార్చింది.. నూరేళ్ల దాంపత్య జీవితాన్ని విషాదంలోకి నెట్టుకుంది.. చివరకు హత్యకు అసలు సూత్రదారిగా పోలీసులకు చిక్కింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఇంజక్షన్ గుచ్చి జమాల్ సాహెబ్‌ను హత్య కోణంలో అసలు కథ.
సెప్టెంబర్ 19న లిప్ట్ అడిగి సహాయం చేసిన వ్యక్తికి ఇంజక్షన్ ఇవ్వడంతో ఆవ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సోమవారం జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులకు నిర్ఘాంత పోయే నిజాలు బయటపడ్డాయి. భార్యే ఈపనికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఇంజక్షన్ గుచ్చి జమాల్ సాహెబ్‌ను అంతమొందించిన హత్య కేసులో ప్రధాన సూత్రదారి మృతుడి భార్యేనని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. పథకం ప్రకారమే హత్య చేసినట్లు భార్య ఇమాంబీపై నిర్దారణకు వచ్చారు పోలీసులు. భార్య ఇమాంబీ ఇచ్చిన సమాచారంతోనే ఈనెల 19న జమాల్ సాహెబ్‌కు ఇంజక్షన్ ఇచ్చారని మీడియా సమావేశంలో ఏసీపీ బస్వారెడ్డి పోలీసులు తెలిపారు. ఈహత్యకేసులో ఐదుగురు కలిసి జమాల్ సాహెబ్ హత్యకు కుట్ర చేశారని వెల్లడించారు. ఇక ప్లాన్ ప్రకారమే జమాల్ సాహెబ్‌ను హత్య చేశారన్నారు. దీంతో.. ఏ1 మోహన్, ఏ2 బండి వెంకన్న, ఏ3 వెంకటేశ్, ఏ4 ఇమామ్‌బీ, ఏ5 యశ్వంత్, ఏ6 వంశీలుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈఘటనలో.. నాలుగు రోజులు కేసు ఛేదనలో కష్టపడిన పోలీసు సిబ్బందికి ఏసీపీ అభినందనలు తెలిపారు.
సెప్టెంబర్ 19న ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జామాల్ సాహెబ్ అనే వ్యక్తి బానాపురం వద్ద నుంచి వెళుతుండగా ఓ వ్యక్తి లిప్ట్ అడిగాడు. లిప్ట్ అడిగిన వ్యక్తి వెనక కూర్చున్నాడు. ఇంతలోనే బైక్ వెనుక కూర్చన వ్యక్తి ఇంజెక్షన్ తో దాడికి పాల్పడ్డాడు. దీంతో జామాల్ బండి మీద నుంచి క్రింద పడిపోయాడు. బండి వెనుక వున్న వ్యక్తి బైక్ తో పరారయ్యాడు. అయితే గుర్తించిన స్థానికులు జమాల్ ను హుటా హుటిన వల్లబి ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. జమాల్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టి అసలు కారకురాలు భార్య ఇమాంబీ అని నిర్ధారణకు వచ్చారు.