NTV Telugu Site icon

Sri Chaitanya Techno Schools : ప్రపంచ రికార్డ్‌కు సన్నద్ధమవుతున్న శ్రీచైతన్య పాఠశాలలు

Sri Chaitanya

Sri Chaitanya

Sri Chaitanya Techno Schools: 39 ఏళ్ల క్రితం ప్రారంభమైన శ్రీచైతన్య ప్రస్థానం సామాన్య విద్యార్థులను సైతం విశ్వవిజేతలుగా తీర్చిదిద్దుతూ IIT-JEE, AIEEE, NEET, Olympiads వంటి జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలలో నెం.1 ర్యాంకులు సాధిస్తూ విద్యారంగంలో అగ్రగామిగా ప్రపంచ రికార్డులను సైతం సాధించి… ఇప్పుడు ఒక సరికొత్త ప్రపంచ రికార్డ్ సాధించేందుకు సమాయత్తమవుతున్న శ్రీచైతన్య విద్యాసంస్థలు. ఉన్నత ప్రమాణాలతో విద్యనందిస్తూ, అనేక రికార్డులను సాధించి, ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. ఇప్పుడు గణితంలో బాల మేధావుల ప్రతిభా పాటవాలను విశ్వవ్యాప్తం చేసేందుకు సంకల్పించి ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేసింది. అందుకుగాను ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, UKతో కలిసి పనిచేస్తున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా శ్రీచైతన్య భారీ స్థాయి విజయాలను అందించడానికి ప్రయత్నిస్తున్నారు.

విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందించడం మాత్రమే కాకుండా, శ్రీచైతన్య సాధించబోయే రికార్డులతో విద్యార్థులకు ప్రేరణ కల్పించాలనే లక్ష్యాన్ని కూడా పెట్టుకుంది. అంతర్జాతీయ గుర్తింపుకు ప్రసిద్ధ వేదిక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, UK విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రత్యేక ప్రతిభను మరియు వివిధ రంగాల్లో సాధించిన అద్భుత విజయాలను డాక్యుమెంట్ చేయడంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, UK సంస్థ అసాధారణ మానవ సామర్థ్యాలను గుర్తించి, శ్రేష్ఠత వైపు ప్రయాణించాలనే ఉద్దేశ్యంతో ఇతరులు స్ఫూర్తి పొందేందుకు వేదికగా పనిచేస్తుంది. శ్రీచైతన్య విద్యా సంస్థలు మూడు ప్రపంచ రికార్డుల ఘనత శ్రీచైతన్య విద్యా సంస్థలు విద్యార్థుల అసాధారణ సామర్ధ్యాలను మరియు వినూత్న అభ్యాస విధానాలను ప్రదర్శిస్తూ మూడు ప్రత్యేక ప్రపంచ రికార్డులను నెలకొల్పాయి.