New Ration Applications: రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలనలో 5 గ్యారంటీలయిన (మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత) కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రత్యేక ఫారమ్ అధికారులను సిద్ధం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ అవుతున్నాయి. అయితే అది నమూనా దరఖాస్తు ఫారం అని తెలియడంతో ఎలా అప్లె చేయాలో అనే దాని గురించి రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
రేషన్ కార్డులు లేని వారు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చని..దాని ద్వారా ప్రభుత్వ పథకాలకు అర్హులు అవుతారని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే కొత్త రేషన్ కార్డుల కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారమ్ సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నమూనా రేషన్ కార్డు దరఖాస్తులో లబ్దిదారుడి పేరు వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు నమోదు పర్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అనే విషయంపై ప్రభుత్వ అధికారులు వివరంగా ప్రజలకు తెలియజేయాల్సి ఉంది. అలాగే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే వారు ఆధార్ కార్డుతో పాటు ఏం కలిగి ఉండాలనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కొత్త రేషన్ దరఖాస్తు ఫారమ్‌లో ముందుగా రేషన్ కార్డు పొందాలనుకునే కుటుంబ పెద్ద పేరుతో పాటు వయసు, లింగం, కులం, పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ నెంబర్, ఫోన్ నెంబర్, చేసే వృత్తి తెలియజేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల వివరాలను వివరంగా పొందుపర్చాలి.
అయితే కొత్త రేషన్ కార్డు దరఖాస్తులో కుటుంబ సభ్యుల వివరాలు పేరు, దరఖాస్తుదారుడితో ఉన్న సంబంధం లింగం, పుట్టిన తేది, ఆధార్ కార్డు మాత్రమే తెలియజేస్తే సరిపోతుంది. కుటుంబసభ్యుల వివరాలు పొందుపర్చిన తర్వాత అడ్రస్, ఇంటి నెంబర్, వార్డు నెంబర్, మున్సిపాలిటి, మండలం, జిల్లా తెలియజేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు దరఖాస్తు రెండు పేపర్లుగా ఉంటుంది. రెండో పేజీలో అప్లై చేసుకున్న వ్యక్తి నుంచి దరఖాస్తు స్వీకరించినట్లుగా అధికారిక ధృవపత్రం తరహాలో మరొకటి ఉంటుంది. అందులో ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు రసీదు పేరుతో ఉంటుంది. అప్లై చేసుకున్న లబ్దిదారుడికి ఈ రసీదు నింపి అధికారి సంతకంతో తిరిగి చెల్లించడం జరుగుతుంది. అయితే ఇప్పుడే ఈ నమూనా అప్లికేషన్ బయటకు రావడంతో రేషన్ కార్డులు లేని వాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నమూనా దరఖాస్తు ఫారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన చాలా మంది ఇదే అప్లికేషన్ ఫారం అనుకుని పొరబడుతున్నట్లు తెలుస్తోంది.
Read also: Corn Benefits: శీతాకాలం సూపర్ ఫుడ్.. మొక్కజోన్నతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో
తొలుత అర్హులైన వారికే కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ముందుగా ఫిజికల్ వెరిఫికేషన్ చేసి అర్హతను నిర్ధారించి జనవరి నెలలో రేషన్ కార్డులు మంజూరు చేస్తామని పౌరసరఫరాల శాఖ తెలిపింది. అర్హులను పరిశీలించి కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించి పౌరసరఫరాల శాఖ ఇప్పటికే కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసినట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఇటీవల జరిగిన కలెక్టర్ సమావేశంలో సంబంధిత శాఖ 5 పేజీల పత్రాన్ని అందజేసింది. దీంతోపాటు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేలా అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని పౌరసరఫరాల శాఖ ఆ పత్రాల్లో పేర్కొంది. దీంతోపాటు మండల అధికారిగా ఉన్న తహసీల్దార్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ గ్రామాలకు తిరిగి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుపై ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు.
Rajastan : రాజస్థాన్‌లో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. నేడు 3:15గంటలకు మంత్రుల ప్రమాణం