NTV Telugu Site icon

BJP MP Soyam Bapu Rao: సోయం బాపురావు మరో సారి హాట్ కామెంట్స్..

Soyam Bapu Rao

Soyam Bapu Rao

BJP MP Soyam Bapu Rao: బీజేపీకి చెందిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తీరు వివాదస్పదవుతోంది. తాజాగా ఎంపీ ల్యాడ్స్ నిధులను తన సొంతం చేసుకునేందుకు వాడుకున్నట్లు బహిరంగంగా చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికలు వస్తే టూరిస్టులు వచ్చినట్లు టికెట్ల కోసం వస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపి ఏం చేయలేదని సొంత పార్టీలోని కొంతమంది నాయకులు ప్రచారం చేయడం వాళ్ల మూర్ఖత్వమే అన్నారు. విందులు ఇచ్చి ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన బీజేపీ టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఓ నాయకుడు నాకే టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Bihar Crisis: అమిషా ఇంట్లో కమలనాథుల కీలక భేటీ.. ఏం చర్చించారంటే..!

అలాంటి వారికి కాదు పార్టీని నడిపించిన వారికే టికెట్ వస్తుందని క్లారిటీ ఇచ్చారు. అడిగిన వాళ్లందరికి టికెట్ ఇస్తుందా.. అదేమైనా బస్సు టికెట్ నా..,రైల్ టికెట్టా.. అంటూ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకోసం పనిచేసిన వారికే టికెట్ ఇస్తుందని అన్నారు. ఎమ్మెల్యే సపోర్ట్ ఉందని తనకు ఎమ్మెల్యేలకు మద్య గ్యాప్ ఉందని కొంతమంది అసత్యప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపై అధిష్టానం దృష్టిసారించిందని అన్నారు. టికెట్ ఇస్తా అని.. లేదా ఇవ్వను అని ఇప్పటివరకు పార్టీ చెప్పలేదని అన్నారు. పార్టీ కోసం పనిచేసిన తనకు టికెట్ వచ్చే అవకాశం ఉందన్నారు. తాను ఎంపిగా ఉండి పార్లమెంట్ పరిధిలో 4 అసెంబ్లీ స్థానాలు గెలిపించుకున్నామన్నారు.
Kick : రవితేజ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్..రీ రిలీజ్ కు సిద్ధమవుతున్న కిక్ మూవీ..