Rain Effect: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. విస్తరణ తర్వాత మరింత విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంటున్నారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఎండల తీవ్రత తగ్గి వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించి శనివారం రాత్రి వాతావరణ బులెటిన్‌ను విడుదల చేశారు. ఈ బులెటిన్‌లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Read also: Andrapradesh : విజయవాడ లో దారుణం.. అత్తను అతి కిరాతకంగా చంపిన అల్లుడు..!
హైదరాబాద్‌లో ఈరోజు కూడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. 26 నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్‌లో నిన్న రాత్రి భారీ వర్షం కురుస్తుండగా, ఈరోజు కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పారు. నిన్న రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రాంతంలో అత్యధికంగా 74.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొత్తగూడెంలో 62, కొత్తగూడెం జిల్లా ములకపల్లిలో 60.2, ఖమ్మం జిల్లా మధిరలో 59.4, జనగాం జిల్లా కొడకండ్లలో 54.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. గత మూడు రోజులుగా 40 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం నల్గొండలో అత్యధికంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హకీంపేటలో కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
Read also: JP Nadda: నగరానికి నడ్డా.. నాగర్ కర్నూల్ భారీ సభ
ఇదిలా ఉండగా బాలానగర్, చింతల్, కూకట్ పల్లి, మాదాపూర్, బేగంపేట, ఎల్బీనగర్, ఘట్‌కేసర్, కీసర, బంజారాహిల్స్, పంజాగుట్టతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. గురువారం కురిసిన భారీ వర్షానికి యాదాద్రిలో పార్క్ చేసిన కార్లు నీట మునిగాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైందని ఐఎండీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రుతుపవనాలు ఏటా జూన్ 8, 10 తేదీల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని, ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని తెలిపారు. అయితే ఈ ఏడాది రుతుపవనాలు 12 రోజులు ఆలస్యంగా రాష్ట్రాన్ని తాకాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన కొత్త అల్పపీడనం కారణంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ నెల 25, 26 తేదీల్లో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
Andrapradesh : విజయవాడ లో దారుణం.. అత్తను అతి కిరాతకంగా చంపిన అల్లుడు..!