NTV Telugu Site icon

MMTS: గుడ్‌న్యూస్‌.. టికెట్‌ ధరలు తగ్గించిన ఎంఎంటీఎస్..

Mmts

Mmts

హైదరాబాదీలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఎంఎంటీఎస్‌.. పెట్రో ధరల పెంపుతూ వరుసగా రవాణా చార్జీలు పెరుగుతుండగా… ఎంఎంటీఎస్‌ మాత్రం టికెట్‌ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ జర్నీ టిక్కెట్ ధరలు తగ్గిపోనున్నాయి.. ఫస్ట్‌ క్లాస్‌ జర్నీ టికెట్ ధర 50 శాతం తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది… తగ్గించిన ధర ఈనెల 5వ తేదీ నుండి అమలు చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ – ఫలక్ నుమా – లింగంపల్లి మధ్య నడిచే రైళ్లల్లో ప్రయాణికులకు తగ్గించిన టికెట్‌ ధరలతో ప్రయోజనం చేకూరనుంది. కాగా, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగిన తర్వాత.. వరుసగా ఆర్టీసీ చార్జీలు, ఇతర చార్జీలను కూడా వడ్డించిన విషయం తెలిసిందే కాగా.. అందుకు భిన్నంగా ఎంఎంటీఎస్‌ ఫస్ట్‌ క్లాస్‌ జర్నీ టికెట్‌ ధరలను తగ్గించింది.

Read Also: COVID 19: కొత్త వేరియంట్‌ కలకలం.. భారత్‌లో తొలి కేసు నమోదు