NTV Telugu Site icon

Mujra party: ముజ్రా పార్టీల పేరుతో గలీజ్ దందా.. అమ్మాయిలతో నగ్న నృత్యాలు..

Mujra Party

Mujra Party

Sot attacks on Mujra Party in Moinabad: దేశవ్యాప్తంగా వరుసగా చిన్నారులు, అమ్మాయిలు అనే తేడా లేకుండా అఘాయిత్యాలు ఆందోళనలకు గురిఅవుతున్నా.. పార్టీల పేరుతో అమ్మాయిలతో గలీజ్ దందా చేయిస్తున్న ఘటన నగరంలో కలకలం రేపుతోంది. కేటుగాళ్లు పోలీసుల కల్లు గప్పి వారిపని వారు చేసుకుంటూ పోతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పార్టీ పేరుతో అమ్మాయిలతో నగ్నంగా డ్యాన్సులు చేయించి, వ్యభిచారం చేయిస్తూ డబ్బులు మూటగట్టుకుంటున్నారు. అంతేకాకుండా గంజాయి మత్తుకు బానిసై తూగుతున్నారు. శని, ఆదివారాలు వస్తే చాలు పార్టీ, పబ్‌ లంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. మత్తులో తను ఏం చేస్తుందో తెలియని అయోమయంలో తూగుతూ తన ఒంటిపై బట్టలు కూడా ఉన్నాయా? లేవా? అనేది కూడా మైమరిపోతున్నారు. కొందరు ఇలాంటి వాటిని సొమ్ముచేసుకుంటుంటే మరికొందరు అమ్మాయిల మత్తులో పడి ఇలాంటి వాటిపై ఎడిక్ట్‌ అవుతున్నారు.

ఇక వీకెండ్ వచ్చింది అంటే చాలు హైదరాబాద్ శివారు ప్రాంతాలలోని ఫామ్ హౌస్ లో అసాంఘిక కార్యక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫామ్ హౌజ్ పేర్ల తో గలీజ్ దందా నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా యువత మత్తులో జోగుతుంది. హైదరాబాద్, వైజాగ్, రాజస్థాన్ ల నుండి అందమైన అమ్మాయి లను రప్పించిన నిర్వాహకులు గలీజ్‌ దందాలను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు నుండి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ బృందం హైదరాబాద్ కు చేరుకున్నారు. మందు, చిందు పక్కనే అమ్మాయిలతో జల్సా చేస్తూ.. యువతులతో నగ్నంగా నృత్యాలు చేయిస్తూ వ్యభిచారం చేస్తున్నారు. ముజ్రా పార్టీ పేరుతో హంగామా సృష్టిస్తూ.. హుక్కా సేవిస్తూ సాప్ట్ వేర్ ఉద్యోగులు మత్తులో జోగుతున్నారు. ఇలాంటి పార్టీ పేరుతో అమ్మాలయతో నగ్నంగా నృత్యాలు చేయిస్తున్నా వారిపై ఇవాల ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. దీంతో ఈఘటన నగరంలో కలకలం రేపింది.

Read also: Revanth Reddy: రాహుల్‌ పై వేటు.. కాంగ్రెస్‌ నాయకులు ఏమన్నారంటే..

హైదరాబాద్‌ శంషాబాద్ మొయినాబాద్ పరిధిలో ముజ్రా పార్టీల పేరుతో గలీజ్ దందా వెలుగులోకి వచ్చింది. అమ్మాయిలతో నగ్నంగా నృత్యాలు చేయిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ముఠాను ఎస్‌ఓటీ పోలీసులు గుట్టును రట్టు చేశారు. హుక్కా సేవిస్తూ యువకులు మైమరిచి పోతున్నారు. అక్రియేషన్ ఫామ్ హౌస్, మ్యాంగో వుడ్ ఫామ్ హౌస్, కుషీ కర్తీ ఫామ్ తో పాటు బ్రౌన్ టౌన్ ఫామ్ హౌజ్ లో నిబంధనలకు విరుద్ధంగా యువత మందుకొడుతూ మైమరచిపోతోంది. పలు ఫామ్ హౌజ్‌లపై కేసులు నమోదు చేశారు పోలీసులు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ లో ఎస్.ఓ.టి. పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఫామ్ హౌస్, హోటల్స్ , పబ్స్, లాడ్జ్ లపై ఎస్ఒటి బృందం దాడి చేశారు. సిగరెట్స్ లో గాంజాయి నింపుకొని సేవిస్తున్న పలువురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 8 లాడ్జీలు, 11 ఫామ్ హౌజ్ లు, 6 పబ్స్, 14 డాబాలపై ఏకకాలంలో SOT బృందం దాడులు నిర్వహించింది. పేట్ బషీరాబాద్ పరిధిలోనివ లక్ష్మి విల్లా గెస్ట్ హౌస్ లో మత్తులో ఊగుతున్న 8 మంది యువకులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సిగరెట్స్ లో గాంజా నింపి సేవిస్తున్న యువకులు భార్గవ్, కుమార్, సుధాకర్, దినేష్, భరత్ కుమార్, శశీధర్, కురుమూర్తి, విక్కి, రాజేష్, రవి, గోవింద్, వినోద్ కుమార్, సతీష్, వివేక్ అగర్వాల్, రిషబ్ అగర్వాల్, కార్తీక్ అగర్వాల్, నేహాల్ శివశంకర్ లను అరెస్ట్. వారిపై NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇక నిర్వాహకులు రాజేష్, ఉదయ్ కిరణ్, నితిన్ అగర్వాల్, అభిజిత్ పరారీలో ఉన్నారని వారికోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
Mallareddy: పవన్ కళ్యాణ్ కి విలన్ గా చెయ్యమని హరీష్ శంకర్ అడిగితే నే ఓకే చెప్పలే

Show comments