NTV Telugu Site icon

Somesh Kumar: సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సోమేశ్ కుమార్

Somesh Kumar

Somesh Kumar

Somesh Kumar: ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్‌లో శుక్రవారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సోమేశ్‌కుమార్‌ను సచివాలయ సిబ్బంది అభినందించారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నారు.

సోమేష్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం కలెక్టర్‌తో సహా వివిధ హోదాల్లో పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేశారు. ఆ తర్వాత గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, 2016లో ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ఆ తర్వాత రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందారు. 2019లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆయన.. ఈ ఏడాది జనవరిలో ఏపీ కేడర్‌కు చెందిన అధికారిగా హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత డీఓపీటీ దాన్ని ఏపీకి బదిలీ చేసింది. ఆ తర్వాత సోమేశ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు.
Talasani Srinivas: డబుల్ బెడ్రూం ఇళ్లు అమ్ముకోవద్దు.. వాటి విలువ కోట్లలో ఉంది

Show comments