NTV Telugu Site icon

Nehru ZooPark: తగ్గేదేలే.. పుష్ప సినిమా స్టైల్ లో జూపార్క్ లో గందపు చెట్లు స్మగ్లింగ్

Nehru Zoopark

Nehru Zoopark

Nehru ZooPark: హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో చోరీ జరిగింది. జూ పార్కులో పులులు, సింహాలు తప్ప ఏమున్నాయి. వాటిని ఎలా దొంగిలించాలా అని ఆలోచిస్తున్నారా? అవును మీ అనుమానం నిజమే.. వాళ్లు జంతువులను తీసుకెళ్లలేదండోయ్ విలువైన వృక్షాలను దొంగలించారు. జూలోని గందపు చెట్లను ఎత్తుకెళ్లారు. అది కూడా పుష్ప సినిమా స్టైల్‌లో నరికి అక్రమంగా రవాణా చేశారు. వాటిని చిన్నచిన్న దుంగలుగా మార్చి జూ పార్కు నుంచి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు షాక్‌కు గురయ్యారు. నెహ్రూ జూపార్క్ కొన్ని పదుల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది అరుదైన జంతువులతో పాటు విలువైన వృక్షజాలాన్ని కలిగి ఉంది. చందనం చెట్లను చూసిన కొందరు దుండగులు చప్పుడు కాకుండా చెట్లను నరికివేసి దొంగలించడంతో అధికారులు షాక్ కు గురయ్యారు. పార్కు పెద్దగా ఉండడంతో సిబ్బంది పట్టించుకోవడం లేదని ఇదే అలుసుగా భావించిన దొంగలు సైలెంట్ గా చెట్లను నరికి ఎత్తుకెళ్లడంపై తీవ్ర సంచనంగా మారింది.

Read also: Hyderabad: చిక్కడపల్లి బాయ్స్ హాస్టల్లో ఏపీ విద్యార్థి ఆత్మహత్య.. కారణం ఇదే..!

ఒకటి రెండు అయితే సరే చప్పుడు కావడం లేదు అనుకుంటారు కానీ.. ఇక్కడ ఏకంగా ఏడు చెట్లను నరికివేసినట్లు అధికారులు గుర్తించారు. చెట్లను నరికివేస్తున్న తీరును పరిశీలిస్తే.. కొద్దిరోజులుగా అక్రమ రవాణా సాగుతున్నట్లు అధికారులు తేల్చారు. ఈ వ్యవహారం ఈ నెల 20న వెలుగులోకి వచ్చింది. అయితే దుండగులు కొన్ని దుంగలను అక్కడే ఉంచారు. వాటిని గుర్తించిన అధికారులు దుంగల కోసం ఎవరైనా వస్తారన్న కోణంలో నిఘా పెట్టారు. మూడు రోజులుగా ఎవరూ రాకపోవడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఇది ఇంటి దొంగల పనేనని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాలను దాటి లాగ్‌లను స్మగ్లింగ్ చేయడం అంత సులభం కాదు. పార్కు గురించి బాగా తెలిసిన వారే ఇలా చేస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు.
Kajal Agarwal : ఆ విషయంలో నేను ఎంతో హ్యాపీగా వున్నాను..