NTV Telugu Site icon

Satavahana Express Train: శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. భయంతో ప్రయాణికులు పరుగులు

Satavahana Express Train

Satavahana Express Train

Satavahana Express Train: వరుస రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల రైలు పట్టాలు తప్పడం, రైళ్లలో పొగ వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన పది మందికి గాయాలయ్యాయి ఘటన మరువకముందే.. తాజాగా మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వేస్టేషన్ సమీపంలో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న శాతవాహన ఎక్స్ ప్రెస్ లో పొగలు వచ్చాయి.

Read also: Pawan Kalyan: మరోసారి ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్ చీకటే

బ్రేక్ లైనర్లు అంటుకోవడంతో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. సూట్ కేసులు, బ్యాగులు సర్దుకుని రైలు నుంచి కిందికి ప్రయత్నించారు. అయితే కొందరు ప్రయాణికులు అప్రమత్తమై రైల్ లోని సేప్టీ చైన్ లాగడంతో రైల్ అధికారులు వచ్చారు. ఏంజరిగిందనే ఆరా తీయగా బ్రేక్ లైనర్ల నుంచి పొగలు రావడం గమనించారు. ప్రయాణికులు భయపడాల్సిన పని లేదని సూచించారు. పొగలను అదుపు చేస్తున్నారని ప్రయాణికులకు అప్రమత్తం చేశారు. రైలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులు దీనికి సహకరించాలని సూచించారు. ఈ ఘటనతో రైలు దాదాపు 15 నిమిషాల పాటు అక్కడే నిలిచిపోయింది. రైల్వే సిబ్బందికి సమాచారం అందించడంతో.. ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది బ్రేక్ లైనర్లను సరిచేయడంతో రైలు అక్కడి నుంచి కదిలింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Chandrababu: ఇవాళ్టి నుంచి 87 రోజులే.. కౌంట్ డౌన్ స్టార్ట్.. లెక్క పెట్టుకోండి

Show comments