NTV Telugu Site icon

Sumeeth Reddy: ఆ ఫ్లాట్‌ మాదే.. కానీ అక్కడేం జరిగిందో మాకు తెలీదు.. సిక్కిరెడ్డి భర్త సుమీత్ క్లారిటీ

Kp Chowdary Sikki Reddy

Kp Chowdary Sikki Reddy

Sikki Reddy Husband Sumeeth Reddy Responds On KP Chowdary Drugs Issue: తమ ఫ్లాట్ ఇచ్చిన పాపానికి.. బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి మెడకు నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ వ్యవహారం చుట్టుకుంది. ఇరువురి మధ్య పరిచయాలు ఉండటంతో.. సిక్కిరెడ్డికి కూడా కేపీ చౌదరి డ్రగ్స్ సరఫరా చేసి ఉండొచ్చనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబసభ్యులు.. ఆ ప్రచారం అవాస్తవమని స్పష్టతనిచ్చారు. కేపీ చౌదరి డ్రగ్స్ వ్యవహారంతో సిక్కిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఆమె భర్త, బ్యాడ్మింటన్ ప్లేయర్ సుమీత్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించారు. కేపీ చౌదరికి తామిచ్చిన ఫ్లాట్‌లో ఏం జరిగిందో తమకు తెలియదని.. అందుకు తాము రెస్పాన్సిబుల్ కాదని అన్నారు.

Rashmi Gautam Hot: రష్మీ కూడా క్లీవేజ్ షో మొదలెట్టేసింది.. లేటెస్ట్ ఫొటోలు చూశారా?

స్నేహిత హిల్స్‌లో ఉన్న ఆ ఫ్లాట్‌ని పెళ్ళికి ముందు తమకు గిఫ్ట్‌గా ఇచ్చారని, అది సిక్కిరెడ్డి పేరు మీద ఉందని సుమీత్ తెలిపారు. వేరే ఫ్లాట్‌కి షిఫ్ట్ అయ్యేవరకు, నాలుగు రోజులపాటు తమ ఫ్లాట్ కావాలని కేసీ చౌదరి అడిగాడని అన్నారు. ఆ ఫ్లాట్‌లో తాము ఎలాగో ఉండట్లేదు కాబట్టి, అతనికి ఇచ్చామని చెప్పారు. అయితే.. ఆ ఫ్లాట్‌లో ఏం జరిగిందని తమకు ఏమాత్రం తెలియదన్నారు. ఒక ప్లేయర్‌గా తాము చాలా జాగ్రత్తగా ఉంటామని.. పార్టీ కల్చర్ అలవాటు ఉండదని.. అసలు చేసుకోమని వెల్లడించారు. ఒకవేళ పార్టీకి వెళ్ళినా.. ఎలాంటి డ్రింక్స్ తీసుకోమన్నారు. తాము ప్రతీ మ్యాచ్‌కి ముందు డోప్ టెస్ట్ ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ ఫ్లాట్ సిక్కి రెడ్డి పేరుపై ఉన్నంతమాత్రాన.. సిక్కి రెడ్డికి డ్రగ్స్‌తో లింక్ ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

Minister KTR: కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌తో కేటీఆర్ భేటీ.. పలు అంశాలపై విజ్ఞప్తి

అంతకుముందు సిక్కిరెడ్డి తల్లి మాధవి మాట్లాడుతూ.. కేపీ చౌదరి తమకు తెలుసు కానీ, ఎలాంటి వాడో తెలియదని పేర్కొన్నారు. తమకు కేపీ చౌదరితో గతంలో ఉన్న పరిచయాల కారణంగా.. వారం రోజుల పాటు నివాసం ఉండేందుకు ఆ ఫ్లాట్ ఇచ్చామన్నారు. ఆ ఫ్లాట్ సిక్కిరెడ్డి పేరు మీద ఉండటం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. సిక్కిరెడ్డి ఎక్కడికి వెళ్లినా, తన భర్తతోనే కలిసి వెళ్తుందని చెప్పారు. కేవలం పార్టీ కోసం ఆ ఫ్లాట్‌ని వాడుకున్నామని కేపీ చౌదరి చెప్పాడని, కానీ డ్రగ్స్ వాడినట్లు తమకు చెప్పలేదని అన్నారు.