NTV Telugu Site icon

మహిళ లాకప్‌డెప్.. ముగ్గురు పోలీసులపై వేటు

CP Mahesh Bhagwat

CP Mahesh Bhagwat

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో మహిళ లాకప్ డెత్ కేసు కలకలం సృష్టించింది.. అయితే, ఈ కేసులో ఎస్సై మహేష్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యపై చర్యలు తీసుకున్నారు రాచకొండ పోలీస్‌ కమిషనర్ మహేష్ భగవత్.. ఆ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మూడురోజుల క్రితం అడ్డగూడూరు పీఎస్‌లో పోలీస్ దెబ్బలు తట్టుకోలేక మరియమ్మ అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే.. దీనిపై పెద్ద దుమారమే రేగింది.. దీంతో.. మరియమ్మ మృతిపై ఉన్నతాధికారులతో సమగ్ర దర్యాప్తు నిర్వహించిన సీప.. ఎస్సై , కానిస్టేబుళ్ల పాత్ర తేలతడంతో.. ముగ్గురినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.