Site icon NTV Telugu

Shamshabad: శంషాబాద్ పరిధిలో మరో దిశ ఘటన.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పు..!

Shamshabad

Shamshabad

Shamshabad: శంషాబాద్ పరిధిలో మరో దిశ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటిచిన ఘటన కలకలం రేపుతుంది. దిశ ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి మరొ ఘటనే జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Read also: Astrology: ఆగస్టు 11, శుక్రవారం దినఫలాలు

శంషాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు గుర్తు తెలియని వ్యక్తులు. స్థానిక సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మహిళను హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతి చెందిన మహిళ ఎవరు? మహిళను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళ వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని అనుమానిస్తున్నారు. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మహిళపై చుట్టుపక్కల పోలీస్ స్టేషన్‌లో ఏమైనా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయా? అని ఆరా తీస్తున్నారు. మహిళకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. కాలనీలోని ప్రతి సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. మహిళకు, ఆమెను హత్య చేసిన దుండగులకు మధ్య ఘర్షణ జరిగిందా? లేక ఎక్కడైనా హత్య చేసి ఇక్కడకు తీసుకొచ్చి నిప్పంటించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Earthquake: అండమాన్‌ నికోబార్‌, జపాన్, కాలిఫోర్నియాలో భూకంపం

Exit mobile version