NTV Telugu Site icon

Balmoori Venkat: హరీష్ రావు రాజీనామా లేఖ వృధా కానివ్వం..!

Blamuri Venkat

Blamuri Venkat

Balmoori Venkat: హరీష్ రావు రాజీనామా లేక వృధా కానివ్వమని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరవీరుల స్థూపాని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరవీరుల చావుకి కారణమైన హంతకుడు హరీష్ రావు అన్నారు. ఉద్యమ సమయంలో నిరుద్యోగులను, యువతను పొట్టనపెట్టుకున్న వ్యక్తి హరీష్ రావు అన్నారు. అలాంటి వ్యక్తి అమరవీరుల స్థూపం వద్దకు రావడంతో ఈ ప్రాంతం మైల పడిందన్నారు. అందుకే పసుపు నీళ్లతో శుద్ధి చేయడం జరిగిందన్నారు. 10 ఏళ్లుగా హరీష్ రావు కి బీఆర్ఎస్ నాయకులకు ఏనాడు అమరవీరుల గుర్తుకు రాలేదన్నారు. హరీష్ రావు బీఆర్ఎస్ లో ఒక జీతగాడు మాత్రమే అన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసి తీరుతారన్నారు. హరీష్ రావు స్పీకర్ ఫార్మాట్లో కాకుండా రాజీనామా లేఖను రాజకీయం చేశారన్నారు. హరీష్ రావు రాజీనామా లేక వృధా కానివ్వనని తెలిపారు.

Read also: Double Ismart : ఇక డీజే మోత షురూ కానుందా..?

ఆగస్టు 15 తర్వాత కచ్చితంగా రాజీనామాను ఆమోదింపజేసే బాధ్యత నేను తీసుకుంటానని తెలిపారు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా పని చేసిన నువ్వు రాజీనామా ఎలా చేయాలో కూడా తెలీదా? అని ప్రశ్నించారు. కేవలం రాజకీయం కోసం వచ్చి డ్రామాలు ఆడుతున్నావన్నారు. ఆగస్ట్ 15 వ తేదీ లోగా 2లక్షల రుణమాఫీ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన్నట్లు బీఆర్ఎస్ రద్దు చేస్తారో లేదో కేసీఆర్ ని చెప్పమనండి అని తెలిపారు. హరీష్ రావు ఆగస్ట్ 15 తర్వాత మీ రాజీనామా ఆమోదం చెందేలా ఎమ్మెల్సీ గా నేను బాధ్యత తీసుకుంటానని తెలిపారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దొంగల వచ్చి వెళ్ళడం కాదన్నారు. పదేళ్లలో మీరు ఏం చేశారో చెప్పండి రండి ఎమ్మెల్సీగా నేను మీకు సవాల్ విసురుతున్నానని అన్నారు.
Minister Komati Reddy: నువ్వు బీఆర్‌ఎస్‌లో ఉద్యోగి మాత్రమే.. హరీష్‌ రావుకు కోమటిరెడ్డి కౌంటర్‌

Show comments