NTV Telugu Site icon

Secunderabad Railway Station: అడల్ట్ కంటెంట్‌లో టాప్.. మొత్తం సౌత్‌లోనే!

Railway Wifi Adult Content01

Railway Wifi Adult Content01

అత్యవసర సర్వీసుల కోసం రైల్వే స్టేషన్స్‌లో అధికారులు ఉచిత ఇంటర్నెట్ సదుపాయాల్ని అమల్లోకి తీసుకొచ్చారు. అఫ్‌కోర్స్.. కాలక్షేపం చేసుకోవడానికి కూడా! కానీ, మొదటి ప్రియారిటీ మాత్రం ఎమర్జెన్సీ సర్వీస్ కోసమే! ఒకవేళ ప్రయాణికుల మొబైల్ నెట్ పని చేయని పక్షంలో, రైల్వే స్టేషన్‌లో ఉండే ఉచిత ఇంటర్నెట్ సేవలు అత్యవసర కార్యకలాపాల కోసం పనికొస్తుందని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ, మనోళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ‘చింతకాయల రవి’ సినిమాలో విక్టరీ వెంకటేశ్ తీరిగ్గా రకరకాల బూతు వెబ్‌సైట్స్‌ని వివరించినట్టు… అడల్ట్ వెబ్‌సైట్స్‌కి విచ్చేస్తున్నారు. అంతటితో ఆగకుండా, తమకు కావాల్సిన అడల్ట్ కంటెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు కూడా!

ఇలా అడల్ట్ కంటెంట్ విస్తృతంగా డౌన్‌లోడ్ చేసుకోవడంలో.. యావత్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్‌లో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అగ్రస్థానంలో ఉంది. రైల్‌వేర్ నడిపే రైల్‌టెల్ సమాచారం ప్రకారం.. దాదాపు 35% శాతం అడల్ట్ కంటెంట్ డౌన్‌లోడ్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నమోదు అవుతున్నట్టు తేలింది. ఆ తర్వాతి స్థానాల్లో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి స్టేషన్స్ ఉండడం మరో విడ్డూరం. మన తెలుగు వాళ్ళు మరీ అంత కరువులో ఉన్నారా? ‘‘మా గేట్ వే డేటా వై-ఫై సెర్చింగ్‌లో ఎక్కువగా ఫోర్నోగ్రఫిక్‌ని సెర్చ్ చేసినట్టు చూపిస్తోంది. నిజానికి, చాలా వెబ్‌సైట్స్ బ్యాన్ అయ్యాయి. కానీ, వీపీఎన్ వల్ల ఆ వెబ్‌సైట్స్‌కి యాక్సెస్ లభిస్తోంది. అందుకే, ప్రయాణికులు ఎక్కువ మోతాదులో అడల్ట్ కంటెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు’’ అని రైల్‌టెల్‌కి చెందిన ఓ సీనియర్ ఆఫీసర్ చెప్పుకొచ్చారు.

సికింద్రాబాద్ ఈ అడల్ట్ కంటెంట్ విషయంలోనే కాదండోయ్, అత్యధికంగా డేటా వినియోగింపబడుతున్న స్టేషన్స్‌లోనూ అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా నాలుగో స్థానంలో ఉంది. ఒక్కో యూజర్ సగటున 30 నిమిషాల డేటా సెషన్‌లో 350 ఎంబీ డేటా వాడుతున్నారు. అందులో 90% అడల్ట్ కంటెంట్‌నే చూస్తున్నారని అధికారులు వెల్లడిస్తున్నారు. కాకపోతే, తాము ఇతర వ్యక్తుల ప్రైవేట్ విషయాల్లో జోక్యం చేసుకునే అర్హత తమకు లేదని తేల్చి చెప్పేసింది.

Show comments