Site icon NTV Telugu

Hyderabad Gold ATM: అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో గోల్డ్ ATM.. ఎన్ని గ్రాములు కొనచ్చంటే?

Gold Atm

Gold Atm

Hyderabad Gold ATM: ఒకప్పుడు ఆర్థిక లావాదేవీల కోసం ప్రజలు బ్యాంకులకు వెళ్లేవారు. డబ్బు, బంగారం దాచుకునేందుకు బ్యాంకులను ఆశ్రయించారు. ఖాతాదారులు తమ నగదును విత్‌డ్రా చేసుకోవడానికి లేదా నిల్వ చేసుకోవడానికి బ్యాంకులకు పరుగులు తీయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ATMలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, కొన్ని సేవలు మినహా, అవసరమైన అన్ని లావాదేవీలు ATMల ద్వారా పూర్తవుతాయి. అయితే ఇప్పుడు ఏటీఎంల ద్వారా డబ్బునే కాదు బంగారం కూడా తీసుకోవచ్చు. కానీ అన్ని ఏటీఎంలలో ఇది సాధ్యం కాదు. గోల్డ్ సిక్కా లిమిటెడ్ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన గోల్డ్ ఏటీఎంల నుంచి మాత్రమే బంగారు నాణేలను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని ఓ మెట్రో స్టేషన్‌లో ఈ బంగారు ఏటీఎంను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా మారుతున్నందున అద్భుతమైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో నగరంలోని అమీర్ పేట మెట్రో స్టేషన్ లో గోల్డ్ ఏటీఎం ప్రారంభమైంది. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ ఆవరణలో గోల్డ్‌ సిక్కా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో గోల్డ్‌ ఏటీఎంను నిర్వాహకులు ప్రారంభించారు.

Read also: Ayodhya Airport : 20 నెలల్లో పూర్తయిన అయోధ్య విమానాశ్రయం… దాని ప్రత్యేకతలివే

ఇక పసిడి ప్రియులు ఆభరణాల దుకాణానికి వెళ్లకుండానే బంగారం కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ ఎటిఎమ్ ఉపయోగించి బంగారు నాణేలను తీసుకోవచ్చు. కానీ ఈ గోల్డ్ ఏటీఎం ద్వారా 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ ATM ఉపయోగించి డెబిట్, క్రెడిట్ కార్డ్ లేదా UPI చెల్లింపు ద్వారా బంగారం, వెండి నాణేలను కొనుగోలు చేయవచ్చు. ఏటీఎం నుంచి నగదు తీసుకున్న విధంగానే బంగారు నాణేలను కొనుగోలు చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఏటీఎంలో సూచించిన విధంగా లావాదేవీ పూర్తయిన వెంటనే, ఎంపిక చేసిన బంగారు నాణేలు బయటకు వస్తాయి. గోల్డ్ ATM ద్వారా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు 0.5 గ్రాముల నుండి 20 గ్రాముల వరకు బంగారం లేదా వెండి నాణేలను ఎంపిక చేసుకోవాలి. డెబిట్, క్రెడిట్ లేదా UPI చెల్లింపుల ద్వారా నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
Ayodhya Airport : 20 నెలల్లో పూర్తయిన అయోధ్య విమానాశ్రయం… దాని ప్రత్యేకతలివే

Exit mobile version