NTV Telugu Site icon

Holidays : సెప్టెంబర్ లో స్కూళ్లకు సెలవులు!.. ఎన్ని రోజులంటే..

Holidyes

Holidyes

Holidays: సెప్టెంబర్ నెల మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు సెలవులు వస్తున్నాయి. అయితే ఈ ఐదు రోజులు రెండు రాష్ట్రాలలో కలిపి సెలవులు వుండనున్నాయి. సెప్టెంబరు 7, 16 తేదీలను ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఆ రెండు రోజులు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు మూతపడనున్నాయి. సెప్టెంబర్ 7న వినాయక చవితి పండుగ వచ్చింది. ఈ 7వ తేదీ..శనివారం వస్తుంది. ఆ తర్వాత ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు సెలవులు ఉంటాయి. చాలా రాష్ట్రాలు ఈ వినాయక చవితిని అత్యంత వైభవంగా జరుపుకుంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఉన్నాయి.

Read also: Astrology: ఆగస్టు 29, గురువారం దినఫలాలు

ఇక.. సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం మరో ప్రభుత్వ సెలవు ప్రకటించింది. మిలాద్-ఉన్-నబీ సెప్టెంబర్ 16న జరుపుకుంటారు. ఈ పండుగ సోమవారం వస్తుంది. అంతకు ముందు రోజు సెప్టెంబర్ 15 ఆదివారం.. అది ఎలాగో హాలిడేనే. అదే విధంగా సెప్టెంబర్ 14వ తేదీ రెండో శనివారం వచ్చింది. ఇలా సెప్టెంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. అన్ని ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యా సంస్థలు సెప్టెంబర్ 16న మూసి ఉండనున్నాయి. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ నెలలో 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వివిధ పండుగలు, ఇతర కార్యక్రమాల కారణంగా ఆయా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. విద్యార్థులకు ఐదు రోజులు సెలవులు వచ్చాయి. తాజాగా సెలవుల జాబితా తెలియడంతో కొందరు విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు.
CM Revanth Reddy : రాష్ట్రానికి ప్ర‌యోజ‌నం క‌లిగించేలా అలైన్‌మెంట్ ఉండాలి