హైదరాబాద్ లో సంచలనం కలిగించింది కిడ్నాప్ కేసు. సరూర్‌నగర్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తన కిడ్నాప్ వెనుక కార్పొరేటర్ హస్తం ఉందని ముందే చెప్పిన సుబ్రహ్మణ్యం.. నరబలికి సంబంధించి తనను చిత్రహింసలు పెట్టారన్నారు. నల్లగొండ చింతపల్లికి తీసుకెళ్లి నరబలి ఇచ్చేందుకు యత్నం చేశారని ఆరోపించారు. ఇంటికి వెళ్తుండగా నన్ను కొట్టి..కారులో తీసుకెళ్లారని వాపోయాడు. కారులో చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. గంజాయి తాగి సిగరెట్లతో కాల్చారని ఆరోపించారు. ఇదిలా వుంటే ఈ కేసులో కార్పొరేటర్ మహేశ్వర్ రెడ్డి సహా నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. నేను నా తండ్రి కలిసి ఓ మైనర్ బాలికను రేప్ చేశామని ఒప్పుకోవాలంటూ వీడియో కూడా రికార్డ్ చేశారు. ఆ వీడియోలన్నీ పోలీసులు సీజ్ చేశారని సుబ్రహ్మణ్యం వెల్లడించాడు.
Saroornagar Kidnap Case Live: నరబలి కేసులో సంచలన విషయాలు

Maxresdefault (2)
