NTV Telugu Site icon

Jagga Reddy: ఎంత తోపులం అయిన సరే ఓ రోజు కాటికి వెళ్ళక తప్పదు..

Jaggareddy Kodanda Reddy

Jaggareddy Kodanda Reddy

Jagga Reddy: ఎంత తోపులం అయిన సరే ఓ రోజు కాటికి వెళ్ళక తప్పదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా దసరా వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ఓటమి అనేక పాటలు నేర్పిస్తుందన్నారు. నేను ఒడిపోయాను నా భార్యకి కార్పొరేషన్ పదవి వచ్చిందని తెలిపారు. నేను ఓడిపోయాక సీఎం రేవంత్ పిలిచి ఆయన కోటాలోనే నా భార్య నిర్మలకి పదవిచ్చారని తెలిపారు. ఏ పండుగ వచ్చినా ముందుండి సంగారెడ్డిలో కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. జగ్గారెడ్డి ఎప్పుడు బలహీనుడు కాడన్నారు. అదిరేటొడు కాదు బెదిరితోడు కాదు జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి ఓ ఫైటర్ అన్నారు. 1995 లోనే నేను పొలిసులతో గోడవపడ్డానన్నారు. అప్పటి మున్సిపల్ ఎన్నికల్లో ఎస్పీ కృష్ణంరాజు నా మనుషులను కొడుతున్నారని తెలిపారు. ఎస్పీ కృష్ణంరాజు కారును ఢీ కొట్టినా.. ఆతర్వాత పోలింగ్ బూత్ లలో రిగ్గింగ్ చేశానని అన్నారు. 3 వేల మందితో పోలీస్ స్టేషన్ ముట్టడించానని తెలిపారు. ఎంత తోపులం అయిన సరే ఓ రోజు కాటికి వెళ్ళక తప్పదన్నారు. ప్రాణికి చావుంది కానీ పైసాకు చావు లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో నా భార్య నిర్మల కానీ ఆంజనేయులు కానీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారేమో


Astrology: అక్టోబర్ 13, ఆదివారం దినఫలాలు

Show comments