NTV Telugu Site icon

Sangareddy: అంగట్లో సరుకుల్లా నర్స్ పోస్టులు.. అమ్మకానికి పెట్టిన కిలాడి లేడీలు..

Sangareddy Froud

Sangareddy Froud

Sangareddy: చదువు పూర్తయితే చాలు.. ఎవరి నోటి నుంచి అయినా వచ్చే మొదటి ప్రశ్న.. నీకు ఉద్యోగం వచ్చిందా? అదేమిటంటే.. ఇంట్లో ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చిందంటే.. ఈ వ్యక్తికి ఉద్యోగం వచ్చిందంటూ రోజూ పాఠం చదివారు. ఈ బాధలన్నీ తట్టుకోలేక పోటీ ప్రపంచంలో ఉద్యోగం కోసం చాలా మంది బ్యాక్ డోర్ ను ఎంచుకుంటున్నారు. ఎవరైనా ఉద్యోగం ఇప్పినంటే చాలు.. లైఫ్ సెటిల్ అవుతుందని లక్షలు తగలబెడుతున్నారు. నిరుద్యోగులే టార్గెట్‌ చేసుకుని స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరుతో ఇద్దరు లేడీలు భారీ మోసం చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

Read also: Rajasthan : పట్టాలపై రీలు చేస్తుండగా రైలు రావడంతో బ్రిడ్జీపై నుంచి దూకిన భార్యాభర్తలు

అనురాధ, మరియమ్మ అనే ఇద్దరు మహిళలు సంగారెడ్డిలో జీవనం సాగిస్తున్నారు. వీరు ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలని టార్గెట్‌ వేసుకున్నారు. ప్రభుత్వ అధికారులుగా చలామణి అవుతూ ఐడి కార్డులు కూడా వీరిపై ముద్రించుకున్నారు. అయితే ఆ కార్డులు చూపిస్తూ నిరుద్యోగులను టార్గెట్‌ చేశారు. నర్స్ పోస్టులు ఉన్నాయని నమ్మించారు. అందులో ఉద్యోగం ఇప్పిస్తే లక్షల్లో ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. వారి ఐడీ కార్డులు చూపించడంతో నిజమని నమ్మిన నిరుద్యోగులు అనురాధ, మరియమ్మలకు డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. అయితే నేరుగా ఆఫీసుకు కాకుండా వారు చెప్పిన ప్రదేశానికి వచ్చి డబ్బులు కవర్‌ లో ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. నిజమే అని నమ్మి తాళి పూస్తేలు కుదువపెట్టి, అప్పు చేసి ఒక్కొక్కరు 3 లక్షల రూపాయలు బాధితులు కట్టారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు సంగారెడ్డి, జహీరాబాద్, బోధన్ కి చెందిన 28 మంది నుంచి 84 లక్షల రూపాయలు అనురాధ, మరియమ్మలు వసూళ్లు చేశారు. అంతేకాదు.. సంగారెడ్డి కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి కలెక్టరేట్ లోనే ఈ కిలాడి లేడీలు నకిలీ అపాయింట్ మెంట్ ఇచ్చారు.

Read also: Sourav Ganguly: నన్ను అందరూ మర్చిపోయారు.. సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు!

నిజమని నమ్మి అపాయింట్‌ మెంట్‌ తీసుకుని డ్యూటీ కోసం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి వెళ్లగా అసలు విషయం బట్టబయలు అయ్యింది. దీంతో మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు తమ డబ్బులు తమకు ఇవ్వాలని బాధితులు నిలదీశారు. దీంతో అనురాధ, మరియమ్మ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఇంట్లో చెప్పలేక, జాబ్ కోసం చేసిన అప్పు తీర్చలేక కొందరు బాధితులు ఆత్మహత్యాకు పాల్పడ్డారు. ఈ ఘటన వెనుక అనురాధ, మరియమ్మలే కాకుండా అసలు సూత్రధారులు వేరే వాళ్ళు కూడా ఉన్నారని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మా డబ్బులు వీరి వద్దనుంచి ఇప్పించాలని పోలీసులకు ఆశ్రయించారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అనురాధ, మరియమ్మ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కలెక్టరేట్‌ లోనే నిరుద్యోగులకు అపాయింట్‌ మెంట్‌ ఇచ్చారంటే వీరి వెనుక అసలు సూత్రధారులు వేరే వారు కూడా ఉన్నారని తెలుస్తోందని తెలిపారు. అనురాధ, మరియమ్మ భాగోతం వెలుగులోకి రాగానే పోలీస్టేషన్‌కు బాధితులు క్యూ కట్టారు. దీంతో పోలీసులు, అధికారుల షాక్‌ తిన్నారు. బాధితులు వందల్లో వుండటం చూసి ఆశ్చర్య పోయారు. అనురాధ, మరియమ్మలపై కేసు నమోదు చేసిన పోలీసుల వారి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.
Puri Jagannath Temple: ఈ రోజు మధ్యాహ్నం తెరచుకోనున్న పూరీ రత్న భాండాగారం తలుపులు