NTV Telugu Site icon

Sangareddy: కస్తూర్బా గురుకులంలో 11 మంది విద్యార్థినిలకు అస్వస్థత..

Sangareddy

Sangareddy

Sangareddy: సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ కస్తూర్బా గురుకులంలో విద్యార్థినిలు అస్వస్థత గురయ్యారు. శ్వాసకోస సమస్యలతో విద్యార్థులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గురుకుల సిబ్బంది విద్యార్థినులను జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో 11 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. గురుకులంలో ఏం జరిగిందనే కోణంలో గురుకుల సిబ్బంది ఆరా తీస్తున్నారు. విద్యార్థులను పరిశీలించిన వైద్యులు సరైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో వున్నారని తెలిపారు. తీవ్ర అస్వస్థలకు గురి కావడానికి కారణాలను తెలుసుకోనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. పిల్లలు అస్వస్థకు గురైనట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆసుపత్రి వద్దకు చేరుకున్న పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు అస్వస్థలకు గల కారణం పూర్తి యాజమాన్యమే అంటూ ఆందోళన చేపట్టారు. ఉదయం జరిగితే ఇప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. గురుకుల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిల్లలు శ్వాస కూడా తీసుకోలేక పోతున్నారని కన్నీరుపెట్టుకున్నారు. దీంతో పిల్లల తల్లిదండ్రుల ఆందోళనతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
Shamshabad Airport: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్.. భయాందోళనలో ప్రయాణికులు..