Sangareddy: ఇటీవల నదీ తీరాల్లో, పెద్ద చెరువులు, సరస్సుల్లో మొసళ్ల దాడులు పెరుగుతున్నాయి. అనుకోకుండా దాడి చేసే మొసళ్ల నుంచి ప్రాణాలు కాపాడడం అంటే మాటలు కాదు. ఒక్కసారి మొసలి నోటికి చిక్కితే… అంతే జీవితం మీద ఆశ వదులుకోవాల్సిందే. ఇక తాజాగా సంగారెడ్డి జిల్లా హత్నూర మండంలం పన్యాల గ్రామ శివారు మంజీరా నదిలో మొసలి కలకలం రేపింది. ఉదయం చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారులకు మొసలి కనిపింది. దీంతో మత్సకారులు భయాందోళన చెందారు. నది ఒడ్డుపై మొసలి సేద తీరుతూ కనిపించడంతో స్థానికులు, మత్సాకారులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు.
Read also: Chittoor Crime: సినిమాకు తీసుకెళ్తానని చెప్పి యువతిపై అత్యాచారం
రోజూ మంజీరా నదిలో చేపలు పట్టుకునేకి వెళతామని తెలిపారు. కానీ మంజీరా నదిలో మొసలి ఉందని గుర్తించలేక పోయామన్నారు. ఇన్ని రోజులు చేపల వేటకు వెళుతున్న మొసలిని గుర్తించలేక పోయామని అన్నారు. అధికారులు మొసలిని పట్టుకుని ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని మత్సకారులు, స్థానికులు కోరుతున్నారు. మంజీరా నదిలో మొసలి ఒక్కటే వుందా? లేక ఇంకా మోసళ్లు వున్నాయా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో స్థానిక యువత కూడా సేద తీరేందుకు వెళుతుంటారని తెలిపారు. మొసలితో ఎప్పటికైనా ప్రమాదమే అని వెంటనే అధికారులు స్పందించి మొసలిని పట్టుకోవాలని కోరారు.
PM Modi-Adani Bag: ప్రియాంక గాంధీ బ్యాగ్‌పై మోడీ-అదానీ ఫోటోలు.. అభినందించిన రాహుల్