NTV Telugu Site icon

Sangareddy: హెల్మెట్ పెట్టుకుని మూడు టమాటా బాక్సులు చోరీ.. ఎక్కడో తెలుసా?

Jagityala Neqws

Jagityala Neqws

Sangareddy: టమాటా ధరలు మండిపోతున్నాయి. సరాసరిగా దేశ వ్యాప్తంగా కిలో రూ.200ధర పలుకుతోంది. ధరలు పెరగడంతో దీంతో వినియోగ దారులు కొనేందుకు వెనుకాడుతున్నారు. భారీ ధరల కారణంగా దొంగల కన్ను టమాటాలపై పడింది. రోజూ ఎక్కడో చోట టమాటాల దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. టమాటా ధరలు పెరగడంతో కొందరు వెరైటీగా పెళ్లిళ్లలో గిప్ట్ లుగా కూడా ఇవ్వడం టమాటా రేట్లపై అంచనా వేయొచ్చు. కొందరు టమాటాలను అమ్మి కొందరు కోటీశ్వరులు అవుతున్నారని కూడా వార్తలు కూడా గుప్పు మన్నాయి. దీంతో కొందరు టమాటాలను చోరీ చేసేందుకు ప్లాన్ లు వేసుకుంటున్నారు. టామాటా ధరలు అమాంతంగా పెరగడంతో కొనేవారి కన్నా దొంగతనం చేసేవారు ఎక్కువయ్యారు. కొనాలంటే డబ్బులు అంతపెట్టలేని పరిస్థితి. అయితే టమాటాలను అమ్మకుందామను కున్నారో లేక కోటీశ్వరులు కావాలని అనుకున్నారో తెలియదు కానీ.. కొందరు టామాటా దోపిడీకి పాల్పడుతున్నారు. ఇది రాష్ట్రాల వారీగా జిల్లాలకు కూడా పాకింది. ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Read also: TS High Court: తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రమాణం

సంగారెడ్డి జిల్లాలో టమాటాలను చోరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. జహీరాబాద్ లోని కూరగాయల మార్కెట్ లో ఈ ఘటన జరగడంతో కొందరు షాక్ కు గురయ్యారు. మార్కెట్ లో కూరగాయల షాప్ ముందు టమాటా బాక్సులను అమ్మడానికి తెల్లవారుజామున వచ్చిన రైతులు బయటికి వెళ్లి వచ్చేసరికి లోపలికి ప్రవేశించి మూడు టమాటా బాక్సులను దొంగ ఎత్తుకెళ్లారు. బైక్ పై వచ్చిన దొంగ హెల్మెట్ ధరించి మూడు సార్లు టమాటా బాక్సును దొంగతనం చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. అక్కడకు వచ్చిన రైతు టామాటాలు చోరీకి గురయ్యారని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మార్కెట్ కు చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. టమాటాలు చోరీ చేసిన వ్యక్తిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. కాగా.. హెల్మెట్ ధరించడం వలన ఆ వ్యక్తి ఎవరు అనేది తెలుసుకునేందుకు కష్టంగా మారిందని తెలిపారు. అయితే టమాటా చోరీ చేసిన వ్యక్తి అక్కడకు ఎలా వచ్చాడనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే మొదటి సారి మార్కెట్ లో దొంగతనం జరిగిందా? లేక ఇంతకు ముందు కూడా ఇలానే దొంగతనాలు జరుగుతున్నాయా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Bank Robbery: పేరుకు అత్యంత సురక్షితమైన బ్యాంకు.. 27 గంటల్లో రూ.900 కోట్ల దోపిడీ