NTV Telugu Site icon

Sandeep Shandilya: హైదరాబాద్‌ సీపీగా సందీప్ శాండిల్య.. ఆయన ప్రొఫైల్ ఇది ?

Sandalya

Sandalya

Sandeep Shandilya: హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సందీప్ శాండిల్య బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మరికొద్ది రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి ఆ స్థానాల్లో కొత్తవారిని నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు ఖరారు చేసిన జాబితా ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జియో విడుదల చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సందీప్ శాండిల్య నియమితులయ్యారు. సీపీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సందీప్ శాండిల్య మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హైదరాబాద్ కొత్త సీపీగా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు సిబ్బంది, అధికారులతో తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలను సజావుగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

ఎన్నికల సంఘం ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని.. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా కృషి చేస్తానన్నారు. హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. సాంకేతికతకు అనుగుణంగా పని చేస్తానన్నారు. ఢిల్లీకి చెందిన సందీప్ శాండిల్య.. 1993 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందినవాడు. మెదటి పోస్టింగ్‌లో భాగంగా గుంటూరులో పనిచేసిన సందీప్ శాండిల్య నల్గొండ, ఆదిలాబాద్, కృష్ణా, సౌత్ జోన్ డీసీపీగా పనిచేశారు. ఆ తర్వాత సందీప్ శాండిల్య సీఐడీ, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, క్రైమ్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌లో పనిచేశారు. 2016 నుంచి 2018 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కూడా పనిచేశారు.రైల్వే అండ్ రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీగా కూడా పనిచేశారు. జైళ్ల శాఖ డీజీగా మూడు నెలల పాటు పనిచేసిన సందీప్ శాండిల్య ప్రస్తుతం పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితా నుంచి ఒక్కో పోస్టుకు ఒకరిని ఎంపిక చేసి వివరాలను రాష్ట్రానికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈసీ పంపిన జాబితాలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పోస్టింగ్‌ను విడుదల చేశారు.
ICC World Cup 2023: ప్రపంచకప్‌లో 7 సార్లు ఓటమి.. 8-0తో రోహిత్ రికార్డు సృష్టించనున్నాడా?