NTV Telugu Site icon

Samath Kumb: నేటి నుంచి సమతా కుంబ్‌ ఉత్సాలు.. 9 కుండాలతో యాగం

Samathakumb

Samathakumb

Samath Kumb: హైదరాబాద్‌ ముచ్చింతల్‌తో 216 అడుగుల పంచ లోహ రామానుజాచార్యుల విగ్రహంతో సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ కేంద్రం ఏర్పడి ఫిబ్రవరి 2వ తేదీ నాటికి ఏడాది పూరైంది. ఇవాల్టి నుంచి ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు సమతా కుంభ్ – 2023 జరుగనుందని వెల్లడించారు చిన జీయర్ స్వామిజీ.. అదే సమయంలో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా 108 దివ్య దేశాలు సమతామూర్తి కేంద్రంలో ఉన్నాయ‌ని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించార‌ని తెలిపారు. అనేక మంది గత బ్రహ్మోత్సవాలను చూశారు. ఈఏడాది కూడా అదే క్రమంలో కార్యక్రమం సాగుతుందని, ఈనేపథ్యంలో.. ఈ ఏడాది 9 కుండాలతో ఉండే యాగశాలను ఏర్పాటు చేసి యాగం నిర్వహించనున్నామని తెలిపారు. అయితే.. సమతా కుంభ్ పేరుతో ప్రతి సంవత్సరం వేడుకలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈనెల 11వ తేదీన లక్ష మందితో భగవద్గీత పారాయణం ఉంటుందన్నారు. ఈసందర్భంగా.. రామానుజాచార్యులు చాలా మేధావి అంతే కాకుండా మనసు ఉన్న మనస్వి, అన్ని వర్గాల వారిని సమాజంలోకి తెచ్చి ఆలయాల్లో భాగస్వాములను చేశారని అన్నారు.

బ్రహ్మోత్సవ వివరాలు:

* ఫిబ్రవరి 2 గురువారం నాడు విశేషోత్సవాలు..
* ఫిబ్రవరి 3 శుక్రవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ..
* ఫిబ్రవరి 4 శనివారం సమతామూర్తికి కృతజ్ఞతాంజలి కీర్తన,రామానుజ నూత్తాందాది సామూహిక పారాయణ..
* ఫిబ్రవరి 5 ఆదివారం సాయంత్రం సకల లోక రక్షకుడికి 108 రూపాలలో చారిత్రాత్మక, అద్భుత శాంతి కళ్యాణ మహోత్సవం..
* ఫిబ్రవరి 6 సోమవారం నాడు ఉదయం వసంతోత్సవం, సాయంత్రం 18 గరుడసేవలు..
* ఫిబ్రవరి 7 మంగళ వారం ఉదయం డోలోత్సవం,హనుమ ద్వాహన సేవ,18 గరుడ సేవలు..
* ఫిబ్రవరి 8 బుధవారం ఉదయం కల్హారోత్సవం, సామూహిక పుష్పార్చన, సాయంత్రం లీలా విహారికి 18 రూపాల్లో తెప్పోత్సవం..
* ఫిబ్రవరి 9 గురువారం ఉదయం సువర్ణ రామానుజులకు ఆచార్య వరి వస్య, సాయంత్రం అశ్వ వాహన సేవ,18 గరుడ సేవలు..
* ఫిబ్రవరి 10 శుక్రవారం ఉదయం సామూహిక ఉపనయనములు, సాయంత్రం గజవాహన సేవ 18 గరుడ సేవలు..
* ఫిబ్రవరి 11 శనివారం ఉదయం రథోత్సవం, చక్ర స్నానం, మధ్యాహ్నం సకల లోక గురుడికి విశ్వశాంతి విరాట్ గీతా పారాయణ..
* ఫిబ్రవరి 12 ఆదివారం ఉదయం ఉత్సవాన్త స్నపనము, సాయంత్రం మహా పూర్ణాహుతి,కుంభ ప్రోక్షణ తో పాటు వివిధ కార్యక్రమాలు జరుగుతాయి.
Amigos: ఇంతకీ ఆ మిస్టరీ ఏంటో ట్రైలర్ లో అయినా చూపిస్తారా?

Show comments