Warangal Preethi Case: వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై సీపీ రంగనాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే.. ప్రీతికి డిసెంబర్ నుంచి వేధింపులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనెల 20న అమ్మాయి తండ్రీ నరేందర్ కు చెప్పిందని, వెంటనే ఆయన మట్టెవాడ ఎస్.హెచ్.వో శంకర్ నాయక్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారని వెల్లడించారు. ఏసిపిని కలిసేందుకు యత్నించారని, 21న పోలీసులు ఆసుపత్రి హెచ్.వో.డి కి ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. వాళ్ళు పిలిచి మాట్లాడారు కూడా అని తెలిపారు. మంగళవారం ఇద్దరు డ్యూటికి వెళ్ళారని, పోలీసులకు ఫిర్యాదు చేశాను.. నన్ను టార్గెట్ చేస్తారా అని ఫ్రెండ్స్ ను ప్రీతి అడిగిందని తెలిపారు. గూగుల్ లో సెర్చ్ చేసి ప్రీతి ఆత్మహత్యకు యత్నించిందని సీపీ రంగనాథ్ వెల్లడించారు. రిపోర్ట్ వస్తే ఏం తీసుకుందో తెలుస్తోందని సీపీ అన్నారు. సూసైడ్ అటెంప్ట్ పై ఎలాంటి దాపరికం లేదన్నారు. రాజకీయం లేదు… నిష్పక్షపాతంగా విచారణ చేపట్టామన్నారు. విచారణ దశలో ఉందని ఫస్టీయర్ విద్యార్థులను విచారిస్తామన్నారు. అరెస్టు చేయడంతో కళాశాల యాజమాన్యం సైఫ్ ను సస్పెండ్ చేసిందని,మెడికల్ పరంగా తదుపరి చర్యలు కాలేజీ తీసుకుంటుందని అన్నారు. సైఫ్ కావాలనే ప్రీతిని వేధించినట్లు వాట్సప్ చాట్స్ ద్వారా తెలిసిందని, తన ఫ్రెండ్స్ తో కూడా ప్రీతి ఎక్కువ చేస్తున్నట్లు చెప్పాడని, సైఫ్ కి ప్రీతి తనను ఎందుకు వేధిస్తున్నావంటూ మెసేజ్ కూడా చేసిందని సీపీ మీడియాకు వెల్లడించారు. ప్రీతి మానసికంగా ఇబ్బంది పడినందువల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని స్పష్టం చేశారు.
సక్సీ నైల్ కోలిన్ అనే ఇంజక్షన్
సక్సీ నైల్ కోలిన్ అనే ఇంజక్షన్ దొరికిందని, గూగుల్ లో ఈ ఇంజక్షన్ గురించి ప్రీతి సెర్చ్ చేసిందని తెలిపారు. బ్లడ్ శాంపిల్స్ తీశామని, టాక్సికాలజీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుందని అన్నారు. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సైఫ్ వేధింపులే కారణంగా ప్రాథమికంగా నిర్దారించామన్నారు. ఈ ఘటనకు ఎలాంటి రాజకీయ రంగు పులమొద్దన్నారు. సైఫ్ కు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదని, పోలీస్ రియాక్ట్ కాలేదన్నది అవాస్తవమన్నారు. పోలీసులను హెల్ప్ కావాలని తనకున్న సంబంధాలతో ఓరల్ గా అడిగారన్నారు. ప్రీతి తండ్రిని అడిగితే పోలీస్ రియాక్ట్ అయ్యారని చెప్పారని తెలిపారు. ర్యాగింగ్ అనేది ఇక్కడ చూడకూడదు బాసింగ్ అనేదే ఇక్కడ ప్రధానం అన్నారు. ఈ ఘటనలో పోలీస్ పరంగా ఎలాంటి నిర్లక్ధ్యం ఉన్నా ఊరుకోమన్నారు.
ప్రీతిని సైఫ్ టార్గెట్ చేశాడు..
ఫోన్ చాటింగ్ లో అవమాన పరుస్తున్నావని అమ్మాయి అడుగిందని, సైఫ్ టార్గెట్ గా హరాస్మెంట్ చేశాడని, వాట్సాప్ గ్రూప్ లో పెట్టి ఇన్సల్ట్ చేశాడని, బుర్ర తక్కువుందని ఇబ్బందులకు గురి చేశాడని ఆవేదనతోనే ఇలా చేసిందని వ్యాఖ్యానించారు. సైఫ్ బాస్ లా వ్యవహరించాడని, సెకండియర్ వాళ్ళను ఫస్టీయర్ వాళ్ళు సర్ అనే అలవాటు ఉందన్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని బాస్ లా వ్యవహరించారని తెలిపారు. ప్రీతిని తెలివిగల అమ్మాయి, ప్రశ్నించే తత్వం గల అమ్మాయన్నారు. అది సైఫ్ సహించలేక పోయాడని, సైఫ్ టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేశాడన్నాడు.
Bandi sanjay: కేసీఆర్ కొడుకు కాకపోతే కేటీఆర్ కు గుర్తింపు ఏదీ..!