NTV Telugu Site icon

Yadadri: అకాల వర్షం అపార నష్టం.. తడిసిన ధాన్యంతో రైతన్న ఆగమాగం..

Yadadri Formers

Yadadri Formers

Yadadri: అకాల వర్షాలు యాదాద్రి జిల్లాలో రైతులను భారీ నష్టాన్ని మిగిల్చాయి. నిన్న రాత్రి గుండాల మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, ఈదురుగాలులతో, కురిసింది. దీంతో వేడితో అల్లాడుతున్న జనాలు కాస్త సేదతీరిందనే చెప్పాలి. అయితే అకాల వర్షానికి రైతులు ఆగమాగమయ్యారు. వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు, తూకం వేసిన బస్తాలు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన 6 వేల బస్తాలు వర్షానికి తడిసి నీట మునిగింది. నీటిలో రాశులుగా పోసిన ధ్యాన్యం నీటిలో కోటుకుపోయింది. బస్తాలన్నీ తడిసి మద్దైయ్యాయి. దీంతో రైతులు నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ధాన్యం అంతా నీటి మునిగినా ఇప్పటివరకు అధికారులు కొనుగోలు కేంద్రం వైపు కన్నెత్తి కూడా చూడలేదని అన్నదాతలు వాపోతున్నారు. తడిసిన ధాన్యం కొర్రీలు లేకుండా కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Read also: Delhi : రాజధానిలో 15000 కిలోల నకిలీ మసాలా దినుసులు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

ప్రతి ఒక్కరూ వచ్చి చూసి వెళ్లేవారే గానీ, కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు, అధికారులు వచ్చి తడిసిన ధాన్యం చూసి వెళ్లడమే తప్పా కొనుగోలు చేసేవారు ఎవరూ లేరని రైతులు అంటున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టుకుని అధికారులకు చెప్పిన ధాన్యం నల్లగా అయ్యిందంటూ కొనుగోలు చేయలేదని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నారు. రైతులను ఆదుకోవాలని, ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. ఇప్పుడైతే తడిసిన ధాన్యాన్ని ఆర బెట్టుకుంటున్నామని తెలిపారు. ఇంకా మూడు రోజులు వర్ష సూచనలు వున్నాయని అన్నారు. ధాన్యాన్ని ఎలా నిల్వ చేసుకోవాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం, పై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Koratala Shiva : ఎన్టీఆర్ లేకుండానే ‘దేవర’ షూటింగ్.. గ్యాప్ లో ఆ పని చేస్తున్న కొరటాల..?

Show comments