NTV Telugu Site icon

నార్సింగి మీర్జాగూడ చౌరస్తాలో‌ రోడ్డు ప్రమాదం

మితిమీరిన వేగం ఓ మహిళ ప్రాణం తీసింది. నార్సింగి మీర్జాగూడ చౌరస్తాలో‌ రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను ఢీ కొట్టిన కారు వేగంగా ముందుకు వెళ్ళబోయింది. స్పాట్ లోనే మృతి చెందింది ఓ మహిళ. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తం అయ్యారు.

కారు వదిలేసి పారిపోతున్న డ్రైవర్ ను వెంబడించి పట్టుకున్న స్థానికులు. దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మృతురాలు అదే ప్రాంతానికి చెందిన పద్మగా గుర్తించారు. మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా కారు నడపడంతోనే ప్రమాదం జరిగింది అంటున్నారు పోలీసులు. డ్రైవర్ రామకృష్ణా రెడ్డి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.