RMP Doctor: మేడ్చల్ మండలం రాజ బొల్లారం అనుబంధ గ్రామంలో అక్బర్ జాపేట్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ RMP డాక్టర్ ను సొంత బామ్మర్దులు దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతుంది. మేడ్చల్ మండలం అక్బర్ జాపెట్ గ్రామానికి చెందిన గౌస్ గతంలో RMP డాక్టర్ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. శామీర్ పెట్ లో నివాసం ఉండే సొంత బామ్మర్దులు బుధవారం అర్ధరాత్రి గౌస్ ఇంటికి వచ్చారు. భూ వివాదంలో మాట మాట పెరిగి గౌస్ ను కర్రతో తలపై బాది వారి వెంట తెచ్చుకున్న కత్తితో గౌస్ పై దాడి చేయగా ఒక్కసారిగా గౌస్ కుప్పకూలాడు. స్థానికులు గమనించి దగ్గర్లో ఉన్న మెడిసిటీ హాస్పిటల్ కు తరలించారు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్నారు పోలీసులు. అయితే అప్పటికే గౌస్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించారు పోలీసులు.
సొంత బామ్మర్దులైన సయ్యద్ లతీఫ్, మెహర్ ఉన్నిసా, సయ్యద్ అల్తాఫ్, హసీనా బేగం, సయ్యద్ ముబీన్ హత్య చేసిన వారీగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినందుకు మేడ్చల్ సీఐ నరసింహారెడ్డి తెలిపారు. గౌస్ హత్యకు గల కారణం భూ వివాదమని గుర్తించారు. గౌస్ కుటుంబ సభ్యులతో పోలీసులు మాట్లాడుతున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ గా వున్న గౌస్ పై భూ వివాదమేనా.. ఇంకా ఏమైనా కక్ష సాధింపు చర్యలు వున్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. గౌస్ పై కత్తులతో దాడిచేసిన వారిని గుర్తించేందుకు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. నిందితులు ప్లాన్ ప్రకారమే గౌస్ పై దాడి చేసినట్లు గుర్తించారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి వుంది.
Vote: కొత్త ఓటుహక్కుకు ముగిసిన దరఖాస్తు గడువు.. ఓటు కోసం 10.42 లక్షల దరఖాస్తులు