Site icon NTV Telugu

Revanth Reddy: హైదరాబాద్ ను చంద్రబాబు, వైఎస్ ఆర్, కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారు..

Revanth Reddy Fir Heat Courters

Revanth Reddy Fir Heat Courters

CM Revanth reddy: గత ముప్పై ఏళ్లుగా చంద్రబాబు, వైఎస్ ఆర్, కేసీఆర్ హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అగ్నిమాపక విభాగం యొక్క అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని ఆదివారం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పట్నం మహెందార్ రెడ్డి, తెలంగాణ ఫైర్ శాఖ డిజి నాగిరెడ్డి, హోం ప్రనిస్పల్ సెక్రెటరీ జితేందర్, సౌమ్య మిశ్రా ఇతరఅధికారులు, ఫైర్ సిబ్బంది పాల్గొననున్నారు.

ఫైర్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ లో కమాండ్ కంట్రోల్ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫైర్ డిపార్ట్ మెంట్ అనేది కేవలం అగ్ని ప్రమాదాలు కోసమే కాదు, విపత్తకర పరిస్థితుల్లో కూడా వీరు సేవలు అందిస్తూ ఉంటారని తెలిపారు. ప్రాణాలు తెగించి అందరి ప్రాణాలు కాపాడడంలో ఫైర్ డిపార్ట్ మెంట్ కీలకమన్నారు. ఎన్నో వేలాది నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ఫైర్ డిపార్ట్ మెంట్ కి భవనం లేకపోవడం మంచిది కాదన్నారు. ఏ నగరంలో శాంతి భద్రతలు ఉంటాయో ఆ నగరం అభివృది చెందుతుందన్నారు. గత ముప్పై ఏళ్లుగా చంద్రబాబు, వైఎస్ ఆర్, కేసీఆర్ హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. రాజకీయాలు కు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలు ను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందన్నారు. హైదరాబాద్ కు ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు ను చంద్రబాబు ప్రతిపాదన చేశారని, దాన్ని కొనసాగిస్తూ వైఎస్ ఆర్ పూర్తి చేశారని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డును త్వరలో తీసుకోస్తామన్నారు. రింగ్ రోడ్డు చుట్టూ ట్రైన్ సదుపాయం కూడా తీసుకు రాబోతున్నామన్నారు.

Read also: Pindam : ఆ రెండు ఓటీటీలలో పిండం మూవీకి సూపర్ రెస్పాన్స్..

హైదరాబాద్ తో తెలంగాణ రాష్ట్ర మొత్తం అభివృద్ధి చెందేలా ప్లాన్ చేశామమన్నారు. 2050 మెగా మాస్టర్ ప్లాన్ ద్వారా ముందుకు పోతామన్నారు. అర్బన్ తెలంగాణా, రూరల్ తెలంగాణా ను అభివృద్ధి చేస్తామన్నారు. ఫార్మ సిటీ కట్టలేదని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ పక్కన ప్రమాద డ్రగ్ తయారీ కంపనీ ఏర్పాటు సరైనది కాదన్నారు. ఫార్మ్ సిటీలో మీరు ప్లాన్ చేస్తే మేము పల్లె లో ప్లాన్ చేస్తున్నామని, 10 నుండి 15 విలేజ్ లో ఫార్మ్ ను ప్లాన్ చేస్తున్నామన్నారు. ఒకే ప్రాంతము 25 వేల ఎకరాల్లో ఫార్మ తీసుకొస్తే నగరం అంత కలుషితం అవుతుందని, అపోహాలకు ఎవరు లోను కాకండని సూచించారు. రాజకీయంగా నాకు అవగాహన ఉంది, నిర్మాణంలో నిర్మాణ సంస్థలతో చర్చిస్తామన్నారు. మేము అంతకు మేము అపర మేధావులు అని నిర్ణయాలు తీసుకోబోమన్నారు. అలా నిర్ణయాలు తీసుకుంటే.. మేడి గడ్డ అవుతుందన్నారు. పరిపాలన పై నాకు కొంత సమయం కావాలి, ఎవరు కుడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదన్నారు. అవగాహన లేకుండా అనుమతులు ఇస్తూ సంతకాలు పెడితే మాజీ HMDA డైరెక్టర్ బాలకృష్ణ పరిస్థితి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Ravichandran Ashwin: అభిమానులకు శుభవార్త.. అశ్విన్‌ వచ్చేస్తున్నాడు!

Exit mobile version