NTV Telugu Site icon

Revanth Reddy Arrest : ఖండించిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిని ఈ రోజు పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌ ను టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ వ్యవస్థ శాంతి భద్రతలు కాపాడడానికి ఉందా… ప్రతి పక్ష నేతల అరెస్ట్ లకోసమే పనిచేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. మహిళా నాయకురాళ్లను రాత్రి వరకు పోలీసు స్టేషన్ లలో ఉంచారని ఆయన విమర్శించారు. తెలంగాణా లో ఉన్నామా…నార్త్ కొరియా లో ఉన్నామా అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో ఫాసిస్టు పాలన సాగుతుందని, ప్రజలు మీ పాలన ను చీదరించు కుంటున్నారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో అరాచక పాలన నడవదని, అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీఎం చక్రవర్తిగా.. ఎమ్మేల్యే లు సామంతులుగా పని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్‌ నియంత పాలన సాగిస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.