తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది.. రేవంత్‌రెడ్డిపై నమోదైన మూడు కేసులను కొట్టివేసింది కోర్టు.. మహబూబాబాద్, చిక్కడపల్లి, ఉస్మానియా యూనివర్సిటీలో పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై ఇవాళ విచారణ జరిపిన ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఆ మూడు కేసులను కొట్టివేసింది.. రేవంత్‌రెడ్డి అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించారన్న అభియోగాలను తోసిపుచ్చింది.. అభియోగాలకు తగిన ఆధారాలు లేకపోవడంతో రేవంత్ రెడ్డిపై ఈ మూడు కేసులు వీగిపోయాయి.. కాగా, ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానం పనిచేస్తున్న సంగతి తెలిసిందే.. వివిధ సందర్భాల్లో ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను విచారిస్తున్న ఈ ప్రత్యేక న్యాయస్థానం.. వేగంగా ఆ కేసులను పరిష్కరించేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.
రేవంత్‌రెడ్డికి ఊరట.. మూడు కేసులు కొట్టివేత

revanth reddy