NTV Telugu Site icon

Bandi sanjay: కరీంన’గరం’లో గరం.. జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్

Bandi Sanjay Karimnagar

Bandi Sanjay Karimnagar

Bandi sanjay: బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్‌ నేడు విడుదల కానున్నారు.దీంతో బీజేపీ శ్రేణులు సంబరాలు మిన్నంటాయి. బండి సంజయ్‌ నేడు విడుదల కానున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు భారీగా కరీంనగర్‌ జైలు వద్దకు చేరుకుంటున్నారు. భారీ ర్యాలీ, ప్రదర్శనలకు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సంజయ్ విడుదల అనంతరం నిర్వహించే ర్యాలీకి అడ్డుకట్ట వేయనున్నారు పోలీసులు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించిన పోలీసులు. ఎటువంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదంటూ కరీంనగర్ పోలీసు కమిషనర్ సుబ్బారాయుడు ప్రకటన విడుదల చేశారు. దీంతో బీజేపీ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read also: Kona Raghupathi: నేనెవరినీ కించపరచలేదు.. ఆవేదన చెందా అంతే

కరీంనగర్ జిల్లా జైల్లో ఉన్న బండి సంజయ్ కి నిన్న రాత్రి బెయిల్ మంజూరైంది. సుదీర్ఘ వాదోపవాదాల తరువాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరి పూచీకత్తుతో నిన్న రాత్రి 10 గంటలకు రిలీజ్ ఆర్డర్ కోర్టు ఇచ్చింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని సాక్ష్యాలను చేరిపివేయవద్దని న్యాయస్థానం షరతులు విధించింది. దీంతో కరీంనగర్ జైలుకు సంజయ్ బెయిల్ పత్రాలు చేరాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు సంజయ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నాయి. టెన్త్ పేపర్ లీకేజీ లో మంగళవారం సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసిన తెలిసిందే. ప్రశ్నా ప్రతాల లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్‌ కి నిన్న హనుమకొండ కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ తరుఫున లాయర్లు బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేయగా కోర్టు విచారణ చేపట్టింది. ఇదే సమయంలో బండి సంజయ్‌కు బెయిల్‌ ఇవ్వద్దని.. కస్టడీ పిటిషన్‌ దాఖలు చేశారు పోలీసులు. దీంతో.. రెండు పిటిషన్లపై హనుమకొండ ఫస్ట్ క్లాస్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనిత రాపోలు విచారణ చేపట్టారు. దీంతో బండి సంజయ్‌ బెయిల్‌పై నిర్ణయాన్ని మూడుసార్లు వాయిదా వేసిన మెజిస్ట్రేట్ చివరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాల మధ్నాహ్నం లోపు బండిసంజయ్ జైలు నుంచి బయటకు రానున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులు సంబరాలు మిన్నంటాయి.
Kona Raghupathi: నేనెవరినీ కించపరచలేదు.. ఆవేదన చెందా అంతే