Site icon NTV Telugu

Real Estate Fraud: రూ.500 కోట్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారి పరార్‌.. లబోదిబో మంటున్న బాధితులు

Uppal Real Estate

Uppal Real Estate

Real Estate Fraud: హైదరాబాద్ ఉప్పల్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ఒకటి కాదు రెండు ఏకంగా రూ.500కోట్లతో ఉండాయించిన ఘటన సంచలనంగా మారింది. జెవి బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియలేస్టేట్ కంపెనీ పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజలను రిమోసం చేసి కోట్లాది రూపాయలను దండుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. అమాయక ప్రజలను పెట్టుబడులుగా మోసం చేస్తూ కోట్లు కొల్లగొట్టి డబ్బులు తీసుకుని పారిపోయారని బాధితులు వాపోతున్నారు. దాదాపు 500 మంది ఏజెంట్లను ఏర్పాటు చేసి సుమారు 7 వేల మంది కొనుగోలుదారులను మోసం చేశారు. భూముల కొనుగోలుకు పెట్టుబడి పథకం ద్వారా అధిక వడ్డీ లాభం చూపి భారీ మోసానికి పాల్పడ్డారన్నారు.

Read also: Hyundai Creta EV: రోడ్లపై చక్కర్లు కొడుతున్న హ్యూందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు.. 2025లో లాంచ్!

పెట్టుబడుల పేరుతో అమాయకులను మోసం చేసి సుమారు 500 కోట్ల రూపాయల వసూలుకు పాల్పడి, జేవీ బిల్డర్స్ ఓనర్స్ వేలూరి లక్ష్మీ నారాయణ, జ్యోతి దంపతులు ఉడాయించినట్లు బాధితులు పేర్కొన్నారు. సుమారు 500 మంది ఏజెంట్ లను ఏర్పాటు చేసుకొని, 7000 మంది కొనుగోలు దారులను జేవీ బిల్డర్స్ ఓనర్స్ వేలూరి లక్ష్మీ నారాయణ, జ్యోతి దంపతులు మోసం చేసినట్లు బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భూమి కొనుగోలు కోసం పెట్టుబడి పథకం ద్వారా అధిక వడ్డీ లాభాన్ని చూపి భారీ మోసం చేశారని లబోదిబో మంటున్నారు. జనగామ ప్రాంత శివారులో తక్కువ రేట్ లలో భూములు తీసుకొని బై బ్యాక్ ఆఫర్ అని చెప్పి కొంతమందికి ఈ భూమిని గుంట లెక్కన ఫార్మ్ లాండ్ గా రిజిస్ట్రేషన్ చేసారు.

కాని చాలా మంది కస్టమర్స్ కి అగ్రిమెంట్ మీదనే మినిమం లక్ష కట్టితే నెలకు 8000/- చొప్పున, 20 నెలలు 160000/- అని కొన్ని నెలలు ఇచ్చి అందరిని మోసం చేశారు. అయితే డబ్బులు పెట్టి , తప్పుడు అగ్రిమెంట్ తో మోసపోయామని భావించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉప్పల్ పోలీస్టేషన్ లో బాధితుల పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో వీరిపై పలు చీటింగ్ కేసులు ఉన్నట్లు సమాచారం. దీనిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
Family Star : భారీ ధరకు సేల్ అయిన ఫ్యామిలీ స్టార్ ఓటిటి రైట్స్..?

Exit mobile version