Rajanna Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాటర్ ట్యాంక్ ఎక్కి కొందరు రేషన్ డీలర్లు నిరసన తెలిపారు. సిరిసిల్ల పట్టణం సాయినగర్ లో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగారు. పాత వారికే రేషన్ డీలర్లు కేటాయించాలని వాటర్ ట్యాంక్ ఎక్కి పెట్రోల్ బాటిల్ పట్టుకొని ఆందోళనకు చేపట్టారు. మా రేషన్ షాపులు మాకే కావాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ స్పందించి మొన్న కేటాయించిన షాపులను రద్దు చేయాలన్నారు. ఆ షాపులను పాతవారికే కేటాయించాలని ఆందోళన చేపట్టారు. పది సంత్సరాల పైగా రేషన్ షాపులు నిర్వహిస్తున్న వారికి ఉన్న పళంగా రద్దు చేస్తే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. మా కుటుంబాలు రోడ్డున పడేసారు అని కన్నీరుమున్నీరుగా విలపించారు. రాత్రికి రాత్రే రేషన్ షాపులు కేటాయించారని అవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి అక్కడి చేరుకుని పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాధితులతో మాట్లాడుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.
CDSCO Lab Test : పారాసిటమల్ వేసుకుంటున్నారా.. డ్రగ్ క్వాలిటీ టెస్ట్‌లో 53 రకాల మందులు ఫెయిల్
Rajanna Siricilla: పాత వారికే రేషన్ డీలర్లు కేటాయించాలి.. పెట్రోల్ బాటిల్ తో నిరసన..
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం..
- వాటర్ ట్యాంక్ ఎక్కి కొందరు రేషన్ డీలర్లు నిరసన..